iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి వచ్చేసిన ‘లంబసింగి’.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?

  • Published Mar 28, 2024 | 8:46 PM Updated Updated Apr 02, 2024 | 2:43 PM

Lambasingi OTT Release Date: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ దుమ్మురేపుతుంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తు ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Lambasingi OTT Release Date: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ దుమ్మురేపుతుంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తు ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

  • Published Mar 28, 2024 | 8:46 PMUpdated Apr 02, 2024 | 2:43 PM
ఓటీటీలోకి వచ్చేసిన ‘లంబసింగి’.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?

ఈ మద్య ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేధికగా కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే ధియేటర్లో రిలీజ్ అయిన నెల లోపే వచ్చేస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్, హర్రర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ లో వచ్చేవాటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.బిగ్ బాస్ బ్యూటీ దివి నటించిన ‘లంబసింగి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఎప్పుడు? స్ట్రీమింగ్ ఎక్కడ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ ఫేమ్ దివి, భరత్ రాజ్ నటించిన ‘లంబసింగి’ మూవీ రిలీజ్ అయిన 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మన్నెం ప్రాంతంలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమాలో డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంది. తాజాగా ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఓ పోలీస్, నక్సలైట్ కూతురు మధ్య నడిచే ప్రేమ కథా చిత్రం ఇది. బిగ్ బాస్ తో బాగా పేరు సంపాదించిన దివి గతంలో గ్లామర్ తరహా పాత్రల్లో నటించింది. ఈ చిత్రంలో మాత్రం ఆమె నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.

ప్రేమ, ఎమోషన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లో దివి తన సత్తా చాటింది. లంబసింగి మూవీ మొత్తం దివి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఓ నక్సలైట్ కూతురు, ఆస్పత్రిలో నర్సు పాత్రలో దివి నటించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నిజంగా దివి కోసమే చూడొచ్చు అని కామెంట్స్ చేశారు. లంబసింగి ఈ ప్యూర్ లవ్ స్టోరీ అనే ట్యాగ్ టైన్ తో థియేటర్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్, మంగళవారం 2 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.  నక్సల్స్ బ్యాగ్ డ్రాప్ తో పాటు ఒక మంచి లవ్, ఎమోషన్ తో తెరకెక్కిన ఈ చిత్రం  ధియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom