మమ్ముట్టీ హారర్ సస్పెన్స్ డ్రామా భ్రమయుగం OTT పార్టనర్ ఫిక్స్!

Brmayugam OTT Partner: మమ్ముట్టి హారర్ సెస్పెన్స్ డ్రామా భ్రమయుగం అద్భుతమైన టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ఓటీటీ పార్టనర్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Brmayugam OTT Partner: మమ్ముట్టి హారర్ సెస్పెన్స్ డ్రామా భ్రమయుగం అద్భుతమైన టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ఓటీటీ పార్టనర్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా మరో హిట్టు అందుకున్న సంగతి తెలిసిందే. ఈరోజుల్లో బ్లాక్ అండ్ వైట్ మూవీతో మమ్ముట్టి పెద్ద ప్రయోగమే చేశారు. ఆ ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజు ఈ మూవీ ఒక్క మలయాళంలోనే రూ.3 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఈ మూవీ ఫిబ్రవరి 15నే తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల కావాల్సింది. కానీ, డబ్బింగ్ సమస్యలు, డబ్బింగ్ వర్షన్ సెన్సార్ పూర్తి కాకపోవడం వంటి సమస్యలతో వాయిదా పడింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్టనర్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా సినిమాకి యావరేజ్ టాక్ వస్తేనే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిది చాలా మంచి టాక్ వచ్చిన ఇలాంటి మూవీకి సంబంధించి ఓటీటీ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటారు. నిజానికి మమ్ముట్టి మూవీ అంటేనే ప్రేక్షకుల్లోల భారీ అంచనాలు ఉంటాయి. ఇటు తెలుగులో కూడా మమ్ముట్టి చిత్రాలకు చాలా మంచి ఆదరణ ఉంటుంది. అలాంటిది ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ ప్రయోగం అనడంతో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ, డబ్బింగ్ సమస్యల వల్ల కేవలం మలయాళం మాత్రమే ఈ మూవీని విడుదల చేశారు. కేవలం మలయాళంలోనే తొలిరోజు రూ.3 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు సహా మిగిలిన డబ్బింగ్ వర్షన్స్ రిలీజ్ డేట్ ని కూడా దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. ఫిబ్రవరి 22 లేదా 23న ఈ మూవీ డబ్బింగ్ వర్షన్స్ ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్టనర్ పై క్లారిటీ వచ్చింది. మలయాళంలో ఈ మూవీ విడుదల కావడంతోనే ఓటీటీ పార్టనర్ ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తవ్వగానే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ థియేటర్ రిలీజ్, ఓటీటీ విడుదలకు మధ్య కచ్చితంగా 42 రోజుల వ్యవధి ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేరళలో థియేటర్స్ యజమానులు ఫిబ్రవరి 22 నుంచి సినిమా రిలీజ్ లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ మూవీ విడుదల అయ్యి సేఫ్ అయ్యిందని చెప్పాలి. అందుకే ఈ మూవీ మేకర్స్ రిస్క్ తీసుకోకుండా ఏదైతే ఓటీటీ విడుదలకు సంబంధించిన గడువు ఉంటుందో దానిని అమలు చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కథ ఏంటంటే?:

తేవన్(అర్జున్ అశోకన్) తన తల్లిని కలుసుకునేందుకు అడవిలో వెళ్తూ దారి తప్పిపోతాడు. అతను ఆకలితో అలమటిస్తూ దిక్కుతోచక అడవిలో తిరుగుతున్న సమయంలో ఓ పాటుబడిన ఇల్లు కనిపిస్తుంది. అక్కడ కుడుమోన్(మమ్ముట్టి), అతని కుమారుడు(సిద్ధార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. అనుకోకుండా వచ్చిన అతిథికి కుడుమోన్ సకల సౌకర్యలు ఏర్పాటు చేస్తాడు. అయితే కుడుమోన్, అతని కుమారుడు వాలకం మీద తేవన్ కు అనుమానం వస్తుంది. ఈ అడవిలో ఇద్దరే ఎలా ఉంటున్నారు? అనే అనుమానం కలుగుతుంది. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి అని తేవన్ ప్రయత్నిస్తాడు. కానీ, ఎన్నిసార్లు ప్రయత్నించినా తిరిగి మళ్లీ అక్కడికే వస్తూ ఉంటాడు. ఇదంతా కుడుమోన్ తాంత్రిక విద్య వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే అసలు తేవన్ అక్కడి నుంచి బయట పడ్డాడా? ఎందుకు కుడుమోన్ అలా చేశాడు? అసలు కుడుమోన్ ఎవరు? అనేదే మిగిలిన కథ.

Show comments