iDreamPost
android-app
ios-app

నేరుగా OTTలో విడుదలవుతున్న తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

  • Published May 07, 2024 | 11:50 AM Updated Updated May 07, 2024 | 11:50 AM

తెలుగు క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా ఒకటి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీల్లోకి విడుదలకు రెడీ అవుతోంది. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ ‍స్ట్రీమింగ్‌ అంటే..

తెలుగు క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా ఒకటి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీల్లోకి విడుదలకు రెడీ అవుతోంది. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ ‍స్ట్రీమింగ్‌ అంటే..

  • Published May 07, 2024 | 11:50 AMUpdated May 07, 2024 | 11:50 AM
నేరుగా OTTలో విడుదలవుతున్న తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

నేటి కాలంలో ఓటీటీలకు ఎంతలా క్రేజ్‌ పెరిగిందంటే.. కొన్ని సినిమాలు థియేటర్లలోకి రాకుండా డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. వేర్వేరు భాషల్లో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు.. ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. వీటికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటంతో.. ఆయా ప్లాట్‌ఫామ్‌లు కూడా భారీగానే ఖర్చు చేసి కొత్త కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని చిన్న సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ చేసేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఒకటి నేరుగా ఓటీటీల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇంతకు అది ఏ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

ప్రేమమ్‌ సినిమాలో శృతి హాసన్‌ భర్తగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అరవింద్‌ కృష‍్ణ.. ఆ తర్వాత వరుస చిత్రాలు చేశాడు. కానీ అవేవి ఆశించిన మేర రాణించలేదు. ఈ క్రమంలో తాజాగా అరవింద్‌ కృష్ణ.. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఆ సినిమా ఏదంటే.. ఎస్‌.ఐ.టీ.. ఈ మూవీలో అరవింద్‌ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటించారు.

ముందుగా ఈ సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ చివరకు ఓటీటీల్లో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. మే 10 నుంచి జీ5 ఓటీటీలో ఎస్‌.ఐ.టీ. మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌ చేసింది. కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో అర‌వింద్ కృష్ణ పోలీస్ ఆఫీస‌ర్‌గా సీరియ‌స్‌.. ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తోన్నాడు. క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అనే ఎల్లో క‌ల‌ర్ స్టిక్క‌ర్‌తో సినిమా మీద ఆస‌క్తిని పెంచారు మేకర్స్‌.

ఎస్‌.ఐ.టీ. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీలో నటాషాదోషి, రుచితా సాదినేని హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఇక ఈ సినిమాకు వీబీఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఇక ఎస్‌.ఐ.టీ. అంటే స్పెష‌ల్ ఇన్వేస్టిగేష‌న్ టీమ్ అని అర్థం. ఓ క్రైమ్‌ను సాల్వ్ చేయ‌డంలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదుర‌య్యాయి.. సంచ‌ల‌నంగా మారిన క్రైమ్‌ కేసును ఓ పోలీస్ ఆఫీస‌ర్ తన తెలివితేటిలతో ఎలా పరిష్కరించాడు అన్న‌ది థ్రిల్లింగ్‌గా ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

యంగ్ ఇండియా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అర‌వింద్ కృష్ణ‌. ఆ త‌ర్వాత హీరోగా ఇట్స్ మై ల‌వ్ స్టోరీ, రుషి, అడ‌వి కాచిన వెన్నెల‌, బిస్కెట్‌తో పాటు ప‌లు సినిమాలు చేశాడు. క‌థ‌ల్లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, స‌రిగ్గా ప్ర‌మోట్ చేయ‌లేక‌పోవ‌డంతో ఈ సినిమాలు ఆనుకున్న స్థాయిలో ఆడ‌లేక‌పోయాయి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet