iDreamPost
android-app
ios-app

OTT Movie: OTTలోకి వెయ్ దరువేయ్ మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్క‌డంటే?

  • Published Apr 03, 2024 | 1:57 PM Updated Updated Apr 03, 2024 | 1:57 PM

సినిమా అన్నా సిరీస్ అన్నా ఇప్పుడు అందరికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ గుర్తొస్తున్నాయి. టాలీవుడ్ లో అగ్రదర్శకుడు పూరి జగన్నాద్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన.. సాయిరాం శంకర్ లేటెస్ట్ మూవీ ఇప్పుడు త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

సినిమా అన్నా సిరీస్ అన్నా ఇప్పుడు అందరికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ గుర్తొస్తున్నాయి. టాలీవుడ్ లో అగ్రదర్శకుడు పూరి జగన్నాద్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన.. సాయిరాం శంకర్ లేటెస్ట్ మూవీ ఇప్పుడు త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 03, 2024 | 1:57 PMUpdated Apr 03, 2024 | 1:57 PM
OTT Movie: OTTలోకి  వెయ్ దరువేయ్ మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్క‌డంటే?

ప్రతి వారం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఏవో ఒక సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి కాబట్టి.. ప్రేక్షకులంతా వీటికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇక త్వరలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోయే సినిమా విషయానికి వచ్చేద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాద్ తమ్ముడిగా.. సినిమాలకు పరిచయం అయినా.. సాయిరాం శంకర్ లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ “వెయ్ ద‌రువెయ్”. సాయిరాం శంకర్ గతంలో డేంజ‌ర్‌, బంప‌ర్ ఆఫ‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించాడు. ఆ తరవాత చేసిన సినిమాలేవీ కూడా ఇతనికి మంచి హిట్ ను ఇవ్వలేకపోయాయి. అలాగే రవితేజ మూవీ నేనింతే లో ముఖ్య పాత్రను పోషించాడు. ఇక ఇప్పుడు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన సినిమా వెయ్ ద‌రువెయ్. మరి ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతుంది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

వెయ్ ద‌రువెయ్ సినిమాకు.. న‌వీన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో నవీన్ రెడ్డి.. దర్శకుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను తెలంగాణ బ్యాక్డ్రాప్ లో .. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. కాగా ఈ సినిమాలో సాయిరాం శంకర్ కు జోడిగా య‌శ్న హీరోయిన్‌ గా నటించింది. సునీల్‌, స‌త్యంరాజేష్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఫేక్ స‌ర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందాల‌ని భావించిన యువత ఎలాంటి కష్ఠాలు పడ్డారు అనేదే ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. అయితే, ఈ సినిమా మార్చి 15న థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే.. థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజులలోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 12నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇక ఓటీటీలో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక వెయ్ దరువెయ్ సినిమా కథ విషయానికొస్తే.. సాయిరాం శంకర్ ఉద్యోగం కోసం అందరిలానే హైదరాబాద్ కు వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ సత్యం రాజేష్ తో కలిసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అతనికి డిగ్రీ లేకపోవడంతో.. ఏ ఉద్యోగంలోను ఛాన్స్ దొరకదు. దీనితో ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి.. ఎలాగైనా ఉద్యోగాన్ని పొందాలని అనుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి హిరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె కూడా ఫేక్ సర్టిఫికేట్ తోనే ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తోంది. మరి సాయిరాం శంకర్ కూడా ఫేక్ సర్టిఫికెట్ తో ఉద్యోగం సంపాదించుకుంటాడా.. వీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అసలు వీరికి ఆ ఫేక్ సర్టిఫికెట్స్ ను ఇచ్చేది ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే.. ఈ సినిమా చూసేయాల్సిందే. మరి వెయ్ దరువెయ్ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş