iDreamPost
android-app
ios-app

The Family Man Season 3: ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లవర్స్ కు గుడ్ న్యూస్.. సీజన్ 3 వచ్చేస్తుంది..

  • Published May 06, 2024 | 5:07 PM Updated Updated May 06, 2024 | 5:07 PM

వెబ్ సిరీస్ లంటే ఈ మధ్య చాలా మంది ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అందరి ఫేవరేట్ సిరీస్ గురించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చేసింది, మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

వెబ్ సిరీస్ లంటే ఈ మధ్య చాలా మంది ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అందరి ఫేవరేట్ సిరీస్ గురించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చేసింది, మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published May 06, 2024 | 5:07 PMUpdated May 06, 2024 | 5:07 PM
The Family Man Season 3: ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లవర్స్ కు గుడ్ న్యూస్.. సీజన్ 3 వచ్చేస్తుంది..

సినిమాలను ఎంత ఇంట్రెస్ట్ గా అయితే చూస్తున్నారో.. అంతకంటే ఇంట్రెస్ట్ గా సిరీస్ లను చూస్తున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలో ఎన్నో సిరీస్ లను అనేక సీజన్స్ గా కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోను అనేక రకాల వెబ్ సిరీస్ లు అన్ని భాషలలో అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు కూడా ఆయా వెబ్ సిరీస్ ల అన్నీ సీజన్స్ ను ఆదరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో బాగా ఫేమస్ అయిన ఓ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రైమ్ వీడియో ఓ అప్ డేట్ ను రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇప్పటికి రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. దీనితో ఈ సిరీస్ మూడవ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఈ సిరీస్ లవర్స్ అంతగా కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. దీనితో తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ గుడ్ న్యూస్ ను చెప్పింది. అదేంటంటే ఈ వెబ్ సిరీస్ నుంచి సీజన్ 3 షూటింగ్ ను ప్రారంబిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ ఉగ్రవాదాన్ని, రెండవ సీజన్ లో ఎల్టీటీఈ ఉగ్రవాదాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.. తెలుగు డైరెక్టర్స్ రాజ్ , డీకే. దీనితో ఈ సిరీస్ నుంచి మూడవ సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి అందరి ఎదురుచూపులు తెర పడింది. షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తయితే కనుక.. త్వరలోనే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.

కాగా సెలెబ్రిటీలు సైతం ఈ సిరీస్ అప్ డేట్ ను చూసి ఉత్సాహ పడుతున్నారు. ఈ సిరీస్ గురించి అప్ డేట్ ఇచ్చిన వెంటనే.. ఎంతో మంది దీనికి కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. వారిలో సినీ సెలెబ్రిటీలు కూడా ఉండడం ఆశ్చర్యం. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2019 లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సిరీస్ మంచి టాక్ సంపాదించుకోవడంతో రెండవ సీజన్ ను తెరకెక్కించారు. ఇక 2021 లో సీజన్ 2 ను విడుదల చేసిన మేకర్స్ కు.. ఆ సీజన్ కు కూడా అనూహ్యమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఫామిలీ మ్యాన్ సీజన్ 3 ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోతుంది. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş