iDreamPost
android-app
ios-app

Panchayat 3 OTT: పంచాయత్ సీజన్ 3 OTT లోకి రాబోయేది అప్పుడే!

  • Published May 02, 2024 | 6:45 PM Updated Updated May 02, 2024 | 7:02 PM

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

  • Published May 02, 2024 | 6:45 PMUpdated May 02, 2024 | 7:02 PM
Panchayat 3 OTT: పంచాయత్  సీజన్ 3 OTT లోకి రాబోయేది అప్పుడే!

ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తున్నా సరే.. వారికి ఇష్టమైన సిరీస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు మూవీ లవర్స్. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు ఎన్నో సిరీస్ లు, సినిమాలు వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చిన ప్రతి సిరీస్ ను ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రైమ్ నుంచి అందరు ఎదురుచూసే సిరీస్.. పంచాయత్.. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్స్ గా వచ్చింది. దీనితో మూడవ సీజన్ కోసం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు .. ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను విడుదల చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో పంచాయత్ సీజన్ 3 గురించి.. త్వరలో స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని ఓ ప్రకటనను విడుదల చేసింది.దీనితో ఈ సిరీస్ లవర్స్ అంతా కూడా పంచాయత్ సీజన్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఐపీఎల్ తర్వాత ఈ సిరీస్ ను రిలీజ్ చేస్తారేమో అని అందరూ భావించారు. ఇక అందరూ భావించినట్లుగానే ఈ సిరీస్ ను మే నెలలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మే నెలలో వస్తుందని ముందే రిలీజ్ చేసినా కూడా.. రిలీజ్ డేట్ ను మాత్రం ఈరోజే అనౌన్స్ చేశారు మేకర్స్. పంచాయత్ సీజన్ 3.. మే 28 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు.. అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీనితో ఈ సిరీస్ లవర్స్ అంతా ఖుషి అయిపోతున్నారు.

Panchayat season3

పంచాయత్ మొదటి రెండు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయయన్న సంగతి తెలిసిందే. నీనా గుప్తా, జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్ నటించిన ఈ వెబ్ సిరీస్ కు మంచి టాక్ లభించింది. ఇప్పటికే రెండు సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మూడవ సీజన్ వచ్చేస్తుంది. ఈ సిరీస్ రెండవ సీజన్ వచ్చి కూడా దాదాపు రెండేళ్ల పైనే అయింది. ఈ రెండు సీజన్స్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఇప్పుడు మూడవ సీజన్ ను రూపొందిస్తున్నారు మేకర్స్. అసలు ఈ సిరీస్ కు ఎందుకు ఇంత క్రేజ్ మొదలైంది, అసలు ఈ సిరీస్ కథేంటి అనే విషయానికొస్తే, పంచాయత్ మొదటి సీజన్ 2020 లో వచ్చింది. ఇది ఒక ప్యూర్ కామెడీ డ్రామా.. ఒక ఊరిలో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ పంచాయత్ సెక్రెటరీ.. ఆ గ్రామ ప్రధాన్‌, ఉప ప్రధాన్‌ , మధ్య మధ్యలో ప్రతి విషయానికి అడ్డుపుల్ల వేసే ఓ వ్యక్తి.. ఇలా అన్ని ప్రతి పల్లెటూరిలో జరిగే సంఘటనలలానే అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సీజన్ 3 వచ్చేలోపు.. మొదటి రెండు సీజన్స్ ను మిస్ అయినా వారుంటే వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş