iDreamPost
android-app
ios-app

OTTలోకి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్.. ది న్యూ ఎంపైర్! స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే !

  • Published Apr 16, 2024 | 7:22 PM Updated Updated May 07, 2024 | 4:40 PM

లోకల్ సినిమాలతో పాటు.. ఇతర భాషల సినిమాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాల గురించి కూడా ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు . ఈ క్రమంలోనే.. గాడ్జిల్లా సిరీస్ లలో వరల్డ్ వైడ్ గా రికార్డు కలెక్షన్స్ సాధించిన ఒక సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.

లోకల్ సినిమాలతో పాటు.. ఇతర భాషల సినిమాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాల గురించి కూడా ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు . ఈ క్రమంలోనే.. గాడ్జిల్లా సిరీస్ లలో వరల్డ్ వైడ్ గా రికార్డు కలెక్షన్స్ సాధించిన ఒక సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.

  • Published Apr 16, 2024 | 7:22 PMUpdated May 07, 2024 | 4:40 PM
OTTలోకి  గాడ్జిల్లా వర్సెస్ కాంగ్.. ది న్యూ ఎంపైర్!  స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే !

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చే రెగ్యులర్ సినిమాలతో పాటు.. కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటాయి, అవే ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ పొందిన మోన్స్టార్ చిత్రాలలో.. ఒకటైన గాడ్జిల్లా, కాంగ్ చిత్రాలు. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అనే సినిమా మొదటి పార్ట్ 2021లో రిలీజ్ కాగా, ఈ సినిమాకు లభించిన ఆదరణతో.. ఈ ఏడాది మార్చి 29 వ తేదీన “గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూస్ ఎంపైర్” అనే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయింది. థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యే సమయానికి.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ ను సాధించింది. ఈ క్రమంలో.. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వారు.. ఓటీటీ ఎంట్రీ గురించి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ కి సంబంధించిన డీటెయిల్స్ ప్రకటించారు మేకర్స్. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమ్ అవుతుందనే విషయాల గురించి చూసేద్దాం.

“గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూస్ ఎంపైర్” సినిమాకు.. ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లెజెండరీ పిక్చర్స్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా అన్నిటికంటే ఎంతో స్పెషల్ ఎందుకంటే.. ఈ మూవీ గాడ్జిల్లా సిరీస్‌లో 38వ సినిమాగా, కాంగ్ సిరీస్‌లో 13వ చిత్రంగా తెరకెక్కింది. ఇక కలెక్షన్స్ విషయంలో ఈ సిరీస్ వరల్డ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఒక్క ఇండియాలోనే ఈ చిత్రం 90 కోట్ల రూపాయలు నికర వసూళ్లను సంపాదించగా.. 110 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక అమెరికా లాంటి ఇతర దేశాల్లో.. ఈ చిత్రం 2350 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇలా మొత్తం మీద ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 3650 కోట్ల రూపాయలు సంపాదించి.. బాక్స్ ఆఫీస్ వసూళ్ళను కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లో తన సత్తా చూపించేందుకు రాబోతుంది.

అయితే, ఓటీటీ , హాలీవుడ్ మీడియా నిబంధనల ప్రకారం.. థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా సరే.. విడుదలైన 45 రోజుల తర్వాత ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వాలనే రూల్ ఉంటుంది. దీనిని బట్టి చూస్తే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు ఇంకా కాస్త సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక థియేటర్ లోనే ఈ సినిమా వసూళ్లను కొల్లగొట్టడంతో.. డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరలకే అమ్ముడు అమ్ముడుపోయాయి. “గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూస్ ఎంపైర్” చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు.. మేకర్స్ వెల్లడించారు, ఇక ఓటీటీ లో కూడా ఈ సినిమా మంచి వ్యూవర్ షిప్ దక్కించుకుంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş