iDreamPost
android-app
ios-app

OTT Movie: OTT లోకి రానున్న ఫ‌హాద్ ఫాజిల్ ఆవేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Apr 24, 2024 | 11:22 AM Updated Updated Apr 26, 2024 | 6:19 PM

సినిమా ఏ భాషలో ఉన్నా సరే.. అది ఓటీటీ లోకి వస్తుందంటే ఎపుడెపుడు ఆ సినిమాను చూద్దామా అని ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఒకటి త్వరలో ఓటీటీ లోకి రానున్నట్లు సమాచారం.

సినిమా ఏ భాషలో ఉన్నా సరే.. అది ఓటీటీ లోకి వస్తుందంటే ఎపుడెపుడు ఆ సినిమాను చూద్దామా అని ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఒకటి త్వరలో ఓటీటీ లోకి రానున్నట్లు సమాచారం.

  • Published Apr 24, 2024 | 11:22 AMUpdated Apr 26, 2024 | 6:19 PM
OTT Movie: OTT లోకి రానున్న ఫ‌హాద్ ఫాజిల్ ఆవేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

లాంగ్వేజ్ ఏదైనా కానీ థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి వస్తున్నాయంటే మాత్రం ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా వరకు సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు అనుకున్న డేట్ కంటే ముందే ఓటీటీ లోకి వచేస్తుంటాయి. సినిమా ఎప్పుడు ఓటీటీ లోకి అడుగుపెడుతుంది అనేది.. ఆయా సినిమాల థియేట్రికల్ రన్ , కలెక్షన్స్ ను బేస్ చేసుకుని ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఫహద్ ఫాజిల్ తాజాగా నటించిన ఆవేశం మూవీ ఓటీటీ ఎంట్రీ డేట్ గురించి బజ్ నడుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఫహద్ ఫాజిల్ అటు మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా.. ఇటు తెలుగునాట కూడా దాదాపు అందరికి సుపరిచితుడే. పుష్ప సినిమాలో విలన్ రోల్ లో అందరిని ఆకట్టుకున్న ఫహద్ ఫాజిల్.. ప్రస్తుతం పార్ట్ 2లో అతని విలనిజం ని ఇంకాస్త పవర్ ఫుల్ గా చూపించనున్నాడనే బజ్ నడుస్తోంది. మరి అది ఎలా ఉంటుందో చూడాలంటే ఆ మూవీ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ క్రమంలో తాజాగా ఫహద్ హీరోగా నటించిన సినిమా ఆవేశం. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఫహద్ కెరీర్ లోనే ఈ సినిమా.. మైలురాయిని చేరుకున్న ఫ‌స్ట్ మూవీగా రికార్డ్ సృష్టించింది. దీనితో ఈ మూవీ అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇక ఆవేశం సినిమాను మే 17 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఆవేశం సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఫహద్ గ్యాంగ్ స్టార్ గా కనిపించాడు. ఇప్పటివరకు ఫహద్ ఏ సినిమాలో కూడా ఇలాంటి క్యారక్టర్ ను చేయలేదు. ఇక ఈ సినిమాలో.. అతను గ్యాంగ్ స్టార్ గా కనిపించడంతో.. అతని ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. ఒక గ్యాంగ్ స్టార్ కథకు.. ఇటు మదర్ సెంటిమెంట్ ను అటు కామెడీని కూడా జోడించి.. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. ఒక ముగ్గురు విద్యార్థులు.. ఇంజ‌నీరింగ్ చ‌ద‌వ‌డానికి కేర‌ళ నుంచి బెంగ‌ళూరు వ‌స్తారు. వీరిని ర్యాగింగ్ పేరుతో.. సీనియర్స్ వేధిస్తూ ఉంటారు. దీనితో లోకల్ గ్యాంగ్ స్టార్ గా పేరొందుతున్న.. ఫ‌హాద్ ఫాజిల్‌ సహాయంతో ఈ ముగ్గురు వారిపై ఎలా రివెంజ్ తీర్చుకున్నారు.. ఈ క్రమంలో వారి చదువులు ఏమయ్యాయి! అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş