iDreamPost
android-app
ios-app

Aavesham OTT : OTT లోకి 130 కోట్లు కొల్లగొట్టిన ‘ఆవేశం’ సినిమా.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..

  • Published May 03, 2024 | 12:22 PM Updated Updated May 03, 2024 | 12:22 PM

మలయాళ సినిమాలు.. ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తున్నాయో చెప్పనవసరం లేదు, ఈ క్రమంలో మరొక మలయాళ సినిమా థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించి త్వరలో ఓటీటీ లో మెప్పించేందుకు సిద్ధం అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

మలయాళ సినిమాలు.. ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తున్నాయో చెప్పనవసరం లేదు, ఈ క్రమంలో మరొక మలయాళ సినిమా థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించి త్వరలో ఓటీటీ లో మెప్పించేందుకు సిద్ధం అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 03, 2024 | 12:22 PMUpdated May 03, 2024 | 12:22 PM
Aavesham OTT : OTT లోకి 130 కోట్లు కొల్లగొట్టిన ‘ఆవేశం’ సినిమా.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..

సినిమా అంటే అది ఏ భాషలో ఉన్నా సరే.. కథను బట్టి ప్రేక్షకులు ఆయా సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు తెలుగు భాషలో విడుదలయ్యే చిత్రాలే కాకుండా.. ఇతర భాషల చిత్రాలను కూడా బాగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈ మధ్య కాలంలో థియేటర్ లో మలయాళ సినిమాలకు ఒరిజినల్ లాంగ్వేజ్ లో వచ్చిన రెస్పాన్స్ చూసి.. తెలుగు డబ్బింగ్ ను కూడా వెంటనే విడుదల చేసారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఇతర భాషల సినిమాలను ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తున్నారో.. ఇక ఓటీటీ విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీ లోకి వచ్చే ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరొక మలయాళ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఆ మలయాళ సినిమా మరేదో కాదు.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన “ఆవేశం”. మలయాళంలో ఫహద్ ఫాజిల్ హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. తెలుగులో పాన్ ఇండియా లెవెల్ లో విలన్ అంతే పేరు సంపాదించుకున్నాడు.. పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప మూవీ లో విలన్ పాత్రలో ప్రతి ఒక్కరిని మెప్పించిన ఫహద్.. లేటెస్ట్ గా చేసిన సినిమా ఆవేశం. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ.130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆవేశం సినిమాలోని ఫహద్ న్యూ లుక్స్ ఏ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్ లో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ డేట్ పైన కూడా ఓ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఎలాగూ ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది కాబట్టి.. అనుకున్నదానికంటే ముందే అంటే మే 9 నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది.

అయితే, తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ ఉంటుందో లేదో తెలియదు కానీ, ఓటీటీ లో మాత్రం తెలుగులో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. క గ్యాంగ్ స్టార్ కథకు.. ఇటు మదర్ సెంటిమెంట్ ను అటు కామెడీని కూడా జోడించి.. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. పూర్తి కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఫహద్ ఫాజిల్ సినిమాల విషయానికొస్తే.. అతను ఓ వైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. మరోవైపు హీరోగా, విల్లన్ గా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. పుష్ప -2 సినిమాలో తన విలనిజం ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉంటుందనే టాక్ నడుస్తుంది. ఆ సినిమాలో ఫహద్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది.. ఆ సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరి, ఆవేశం సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş