P Krishna
Double Ismart Movie: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్‌గా రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న పంద్రాగస్టు కానుకగా రిలీజ్ చేశారు. ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
Double Ismart Movie: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్‌గా రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న పంద్రాగస్టు కానుకగా రిలీజ్ చేశారు. ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
P Krishna
ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఏలేస్తుంది. ధియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కొన్నిసినిమాలైతే నెల రోజులకు ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, హర్రర్ జోనర్ లో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. కంటెంట్ బాగుంటే భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలను కూడా ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రిమింగ్ ఎక్కడో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..
రామ్ పోతినేని, అందాల భామ కావ్య థాపర్ జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించారు. పూరి జగన్నాథ్ ఈ మూవీ తెరకెక్కించారు. మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాల ఆ అంచనాలు అందుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్న భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ మూవీ ధియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.
కథ విషయానికి విస్తే.. తన తల్లిని చంపిన వ్యక్తిని వెతుకుతూ ఉంటాడు ఇస్మార్ట్ శంకర్. తన అమ్మను చంపింది బిగ్ బుల్ (సంజయ్ దత్) అని తెలిసి అతని కోసం వెతుకుతూ బిజినెస్, డబ్బులు టార్గెట్ చేస్తూ వస్తుంటాడు. అదే సమయంలో జన్నత్ (కావ్య థాపర్) పరిచయం కావడం.. ఆమె ప్రేమలో పడటం జరుగుతుంది. ఇదిలా ఉంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన బిగ్ బుల్ కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని తెలియడంతో మెమరీ ట్రాన్స్ఫార్ ద్వారా తాను చనిపోయినా తన జ్ఞాపకాలు, ఆలోచనలు ఎప్పటికీ బతికే ఉండాలని బిగ్ బుల్ కోరుకుంటాడు. తన మెమరీ ట్రాన్స్ఫార్ కోసం సరైన వ్యక్తుల కోసం వెతుకుతుంటాడు. ఆ సమయంలో ఇస్మార్ట్ గురించి తెలుస్తుంది. గతంలో అతనికి మెమరీ ట్రాన్స్ఫర్ చేశారని తెలుసుకొని మళ్లీ అతన్నా టార్గెట్ చేస్తారు. ఈ క్రమంలోనే బిగ్ బుల్ మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఇస్మార్ట్ శంకర్ తన జ్ఞాపకాలు కోల్పోతాడా? బిగ్ బుల్ మెమరీతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? రా ఆఫీసర్స్ బిగ్ బుల్ ని పట్టుకుంటారా? ఇస్మార్ట్ శంకర్ తన పగ తీర్చుకుంటాడా? ఇవన్నీ తెలియాంటే సినిమా చూడాల్సిందే.