iDreamPost
android-app
ios-app

OTT Suggestion: OTTలో కాంతారాని మించిన సిరీస్! ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం అని బాధపడతారు!

  • Published Apr 25, 2024 | 4:23 PM Updated Updated Apr 26, 2024 | 6:15 PM

థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు అందరు ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు చూసిన థ్రిల్లర్ మూవీస్ అన్ని ఒక ఎత్తైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒక ఎత్తు. ఒకవేళ ఈ సినిమాను కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు అందరు ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు చూసిన థ్రిల్లర్ మూవీస్ అన్ని ఒక ఎత్తైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒక ఎత్తు. ఒకవేళ ఈ సినిమాను కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

  • Published Apr 25, 2024 | 4:23 PMUpdated Apr 26, 2024 | 6:15 PM
OTT Suggestion: OTTలో కాంతారాని మించిన సిరీస్! ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం అని బాధపడతారు!

థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ఇప్పుడు అందరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒక థ్రిల్లర్ సినిమా వస్తుంది అంటే ఒంటరిగా కూర్చుని చూసే సాహసాలు చేస్తున్నారు మూవీ లవర్స్. దీనితో మేకర్స్ కూడా ఆయా జోనర్స్ కు తగిన సినిమాలను ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ జోనర్ లో ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ ఒకటైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ మరొక లెవెల్. సినిమాలకంటే కూడా సిరీస్ లలో చూపించే ట్విస్ట్ లో మరో లెవెల్ లో ఉంటాయని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఈ సిరీస్ చూసిన తర్వాత కొన్ని వారాల పాటు మైండ్ లో తిరుగుతూ ఉండడం పక్కా అని చెప్పి తీరాల్సిందే. మరి ఇంతకీ ఈ సిరీస్ ఏంటి ఎక్కడ చూడాలి అనే విషయాల గురించి చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు “సుడాల్”. ఇది ఖచ్చితంగా ఒక వర్త్ వాచింగ్ సిరీస్ అని చెప్పి తీరాలి. ఒక్కసారి ఈ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే.. నెక్స్ట్ ఏమి జరుగుతుందా అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ తో .. ఈ సిరీస్ ను పూర్తిగా కంప్లీట్ చేసేవరకు నిద్ర కూడా పట్టదు. అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సిరీస్ అందరిని కట్టి పడేస్తుందని చెప్పి తీరాలి. ఇందులో ఉండే ట్విస్ట్స్, టర్నింగ్ పాయింట్స్ కి అందరు ఆశ్చర్య పోవాల్సిందే. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లోస్ట్రీమింగ్ అవుతోంది. పైగా తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. అసలు ఎందుకు ఈ సిరీస్ ను చూడాలి అనే విషయానికొస్తే.. ఒక చిన్న స్టోరీ లైన్ ను తీసుకుని.. ఈ సిరీస్ ను అద్భుతంగా పూర్తి చేశారు.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఓ ఊరిలో ఉన్న సిమెంట్ ఫ్యాక్ట‌రీ అక్కడ ప్రజలందరికీ జీవనాధారం. కానీ అనుకోకుండా ఓ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ ఫ్యాక్టరీ కాలిపోతుంది. ఆ ఫ్యాక్టరీ ఓనర్ పై ఉన్న కక్షతోనే ఎవరో ఆ ఫ్యాక్టరీని తగలపెట్టి ఉంటారని పోలీసులు నమ్ముతారు. ఈ క్రమంలో ఆ ఫ్యాక్ట‌రీ వ‌ర్క‌ర్ యూనియ‌న్ ప్రెసిడెంట్ పై అనుమానం వ్య‌క్తం చేస్తారు. సరిగ్గా అదే సమయంలో అతని కూతురు కనిపించకుండా పోతుంది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని భావించిన పోలీసులు.. ఆమె కోసం సెర్చింగ్ మొదలు పెడతారు. అయితే వారి అన్వేషణలో ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకు, ఫ్యాక్ట‌రీ యూనియ‌న్ ప్రెసిడెంట్ కూతురు ప్రేమించుకున్నారని.. పెద్ద‌లు త‌మ ప్రేమ‌ను అంగీక‌రిస్తారో లేదో అన్న భ‌యంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయారన్న విషయం తెలుస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే అదే ఊరిలో ఉండే చెరువులో వారి ఇద్దరి శవాలు బయటపడతాయి. వారు ఆత్మహత్య చేసుకున్నారా ! లేదా ఎవరైనా హత్య చేశారా ! తన కొడుకు మరణానికి కారణం తెలుసుకున్న తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది ! అసలు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను కచ్చితంగా చూడాల్సిందే.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom