iDreamPost

OTT Movie Suggestion: పనోడి భార్యతో భూస్వామి..! ట్విస్టులతో మతిపోగొట్టే మూవీ OTTలోకి!

  • Published May 11, 2024 | 2:00 PMUpdated May 11, 2024 | 2:33 PM

ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా కూడా.. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉంటె బావుండు అని అనుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. అలాంటి వారి కోసమే ఈ సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో ఉందొ చూసేద్దాం.

ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా కూడా.. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉంటె బావుండు అని అనుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. అలాంటి వారి కోసమే ఈ సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో ఉందొ చూసేద్దాం.

  • Published May 11, 2024 | 2:00 PMUpdated May 11, 2024 | 2:33 PM
OTT Movie Suggestion: పనోడి భార్యతో భూస్వామి..! ట్విస్టులతో మతిపోగొట్టే మూవీ OTTలోకి!

థియేటర్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇటు ఓటీటీ లోను ఎప్పటికపుడు కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కానీ మూవీ లవర్స్ కు మాత్రం ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తే బావుండు.. ఇంకా ఏమైనా మంచి సినిమాలు ఓటీటీ లో ఉన్నాయేమో అని సెర్చ్ చేసేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసమే వచ్చేసింది.. ఈ ఇంట్రెస్టింగ్ సినిమా. దాదాపు ఇప్పుడు అందరు మలయాళీ సినిమాలను చూస్తూనే ఉన్నారు కాబట్టి.. ఈ సినిమాను చూసేందుకు అందరికి మరింత ఆశక్తి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి, మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “అంచక్కల్లకొక్కన్”. 2024 లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ లో మాత్రం అదరగొట్టేస్తుంది. చాలా వరకు సినిమాలు థియేటర్ ఆడియన్స్ ను మెప్పించకపోయినా. ఓటీటీ ఆడియన్స్ ను మాత్రం యిట్టె మెప్పించేస్తాయి. అలాంటిదే ఈ సినిమా కూడా.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా 1986లో నేపథ్యంలో కొనసాగుతోంది. లుక్మాన్, అవరన్, చెంబన్, వినోద్ జోస్, మణికందన్, ఆచారి, శ్రీజిత్ రవి, సెంథిల్ కృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేసి ఉంటె మాత్రం. ఓ మంచి ఇంట్రెస్టింగ్ సినిమాను మిస్ చేసినట్లే. అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.

ఈ సినిమా కథేంటంటే.. అన్ని సినిమాలానే ఇది కూడా ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమానే. కానీ అలా మాత్రం ఉండదు. అంతకు మించిన ట్విస్ట్ లతో ఈ సినిమా కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే.. శ్రీజిత్ రవి, అచ్యుతానంద, బిట్టో డేవిస్ ముగ్గురు కలిసి మద్యం సేవిస్తూ ఉంటారు. అదే సమయంలో అడవిలో అడవి పందులను వేటాడుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది.దీనితో ఆ ముగ్గురు కలిసి అడవిలోకి వెళ్తారు. కానీ, కొంత దూరం వెళ్ళగానే.. అక్కడ రవిని ఎవరో వ్యక్తి దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఎం జరిగింది ? ఆ హత్య చేసింది ఎవరు ? ఆ కేసును ఎవరు డీల్ చేశారు ? ఆ సమయంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి