iDreamPost
android-app
ios-app

OTT Movies: సంవత్సరం తర్వాత నేరుగా ఓటీటీలోకి వస్తున్న సినిమా!

కొన్ని సినిమాలు ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్నా అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తున్నాయి. థియేటర్‌ ప్రేక్షకులు ఆదరించరన్న కారణంతో నేరుగా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు.

కొన్ని సినిమాలు ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్నా అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తున్నాయి. థియేటర్‌ ప్రేక్షకులు ఆదరించరన్న కారణంతో నేరుగా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు.

OTT Movies: సంవత్సరం తర్వాత నేరుగా ఓటీటీలోకి వస్తున్న సినిమా!

సినిమా తీయటం అంటే మామూలు విషయం కాదు. 24 క్రాఫ్ట్‌లను సరిగా పని చేయించుకుని మూవీ తీయటం ఒక ఎత్తయితే.. దాన్ని రిలీజ్‌ చేయటం మరో ఎత్తు. థియేటర్లలో ఓ సినిమా విడుదల కావటం అన్నది సాధారణ విషయం కాదు. మూవీని ప్రేక్షకుల ముందుకు చేర్చే డిస్ట్రిబ్యూటర్లు దొరక్క చాలా సినిమాలు మూలన పడుతూ ఉంటాయి. వాటికి మోక్షం రావటానికి ఎంత సమయం పడుతుందో.. అసలు ఆ సమయం వస్తుందో లేదో కూడా తెలీదు.

అలాంటి సినిమాలకు ఓటీటీ మంచి వేదికగా మారుతోంది. ప్రశాంత్‌ వర్మ- తమన్నా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ద టీజ్‌ మహాలక్ష్మి’ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్నేళ్ల పాటు మూలన పడింది. తాజాగా, నేరుగా ఓటీటీలోకి వచ్చేయడానికి సిద్ధం అయింది.  ఇక, బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ అజయ్‌ కుతర్వర్‌ హీరోగా నటించిన ‘‘ అజయ్‌ గాడు’’ సినిమాది కూడా అదే పరిస్థితి. దాదాపు సంవత్సరం క్రితమే చిత్ర షూటింగ్‌ పూర్తయింది. అయితే, అనుకోని కారణాల వల్ల మూవీ విడుదల కాలేదు.

నిర్మాతలు ఓ సంవత్సరం పాటు సినిమాను రిలీజ్‌ చేయకుండా అలానే ఉంచేశారు. ఇప్పుడు ఈ మూవీకి మోక్షం వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీకి వచ్చేస్తోంది. చాలా కాలం అయింది కాబట్టి.. ప్రేక్షకులు సినిమాను థియేటర్‌లో చూడకపోవచ్చని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీకి ఇచ్చేశారని సమాచారం. అజయ్‌గాడు సినిమా జనవరి 12వ తేదీనుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది.

ఈ మేరకు తాజాగా ఓ అధికారిక ప్రకటన వచ్చింది. కాగా, అజయ్‌ చాలా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పని చేశాడు. బిగ్‌బాస్‌లో ఎంట్రీతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. బిగ్‌బాస్‌ ఫేమ్‌తోటే హీరోగా కూడా మారాడు. ఈ నేపథ్యంలోనే ‘అజయ్‌ గాడు’ అనే సినిమా అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో అజయ్‌ సరసన భానుశ్రీ, శ్వేత మెహతాలు నటించారు. చందన కొప్పిశెట్టితో కలిసి అజయ్‌ ఈ మూవీని నిర్మించాడు. అంతేకాదు.. స్వయంగా అజయే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మరి, దాదాపు సంవత్సరం తర్వాత నేరుగా ఓటీటీలోకి వస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అజయ్‌ సినిమా ‘అజయ్‌ గాడు’పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet