iDreamPost
android-app
ios-app

OTTలో 5 బెస్ట్ ట్రెండింగ్ సినిమాలు! ఫస్ట్ 3 అస్సలు మిస్ కావద్దు!

  • Published Mar 27, 2024 | 6:17 PM Updated Updated Mar 27, 2024 | 6:17 PM

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆహ ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన మూవీస్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 సినిమాలేంటో చూద్దామా ..

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆహ ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన మూవీస్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 సినిమాలేంటో చూద్దామా ..

  • Published Mar 27, 2024 | 6:17 PMUpdated Mar 27, 2024 | 6:17 PM
OTTలో  5 బెస్ట్ ట్రెండింగ్ సినిమాలు! ఫస్ట్ 3 అస్సలు మిస్ కావద్దు!

కరోనా సమయంలో థియేటర్స్ మూత పడిన తరువాత .. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వచ్చేశాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో ఓటీటీ ప్లేట్ ఫార్మ్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ప్రతి వారం భాషతో సంబంధం లేకుండా .. అన్ని భాషలలో ఉన్న బెస్ట్ సినిమాలను, సిరీస్ లను ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంచుతున్నారు. థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలను కూడా.. ఈ మధ్య ముందుగానే కొనుగోలు చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. అయితే, అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కంటే కూడా.. తెలుగు సినిమాలు, సిరీస్ లు ఎక్కువగా విడుదల అయ్యే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ “ఆహ”. నిజంగానే ఆహ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి, వాటిలో అసలు మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 5 సినిమాలేంటో చూసేద్దాం.

1) మిక్స్ అప్:
ఈ సినిమా తట్రైలర్ నే బోల్డ్ గా రిలీజ్ చేశారు. ఓ విధంగా ఈ సినిమా ఒక న్యూ ఏజ్ బోల్డ్ కంటెంట్ సినిమాగా చెప్పొచ్చు. ఈ సినిమాకు ఆకాష్ బిక్కీ దర్శకత్వం వహించారు. కాగా మిక్స్ అప్ లో కమల్ కామరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జావేరి, అక్షర గౌడ ప్రధాన పాత్రలుగా నటించారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి బాండింగ్ ఉండాలి అనే కథాశంతో ఈ సినిమాను రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా టాప్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

2) చెఫ్ మంత్ర సీజన్ 3:
నిహారిక కొణిదెల హోస్ట్‌గా చేస్తున్న షో చెఫ్ మంత్ర సీజన్ 3. దీనిలో టాలీవుడ్ టాప్ హీరోస్, హీరోయిన్స్, సెలెబ్రిటీలు, డైరెక్టర్లు ఇలా అందరు వారి వారి సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు వస్తూ ఉంటారు. హోస్ట్ వారితో వంట చేయిస్తూ .. మూవీస్ కు సంబంధించిన ముచ్చట్లను అడుగుతూ ఉంటారు. ఈ షో సుమారు 3 వారలా నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ షో టాప్ 2 స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

3) భూతద్ధం భాస్కర్ నారాయణ:
దిష్టి బొమ్మ కథాంశంతో తెరకెక్కిన క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ “భూతద్ధం భాస్కర్ నారాయణ”. ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. కాగా, శివ కందుకూరి, రాశి సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ప్లాట్ ఫార్మ్ లో మూడవ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. క్రైమ్ , ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ మంచి ఛాయస్ అని చెప్పొచ్చు.

4) అంబాజీపేట మ్యారేజి బ్యాండు:
హీరో సుహాస్ అద్భుతంగా నటించిన రీసెంట్ మూవీ.. “అంబాజీపేట మ్యారేజీ బ్యాండు”. ఈ సినిమా కోసం సుహాస్ ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమాకు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాలో శివాని నాగరం, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు. లవ్, క్యాస్ట్ వంటి టాపిక్స్ ను టచ్ చేస్తూ ఈ సినిమాను రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా టాప్ 4 ట్రెండింగ్ లో ఉంది.

5) భామా కలాపం 2:
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన సినిమా భామా కలాపం. ఈ సినిమా మొదటి సీజన్ కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. రెండవ సిరీస్ ను కూడా కొనసాగించారు. ఇదొక కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. ప్రస్తుతం ఈ సిరీస్ టాప్ 5 ట్రెండింగ్ లో ఉంది.

కాబట్టి, ఈ సినిమాలను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆహ ప్లాట్ ఫార్మ్ లో వెంటనే చూసేయొచ్చు. మరి, ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet