Project Z OTT: ఆరున్నరేళ్ల తర్వాత OTT లోకి సందీప్ కిషన్ మూవీ..

కొన్ని సినిమాలు ఎందుకో థియేటర్లో రిలీజ్ అయ్యి ఏ టాక్ తెచ్చుకున్న కూడా.. ఓటీటీ లోకి రావడానికి మాత్రం చాలా సమయం తీసుకుంటాయి. ఈ క్రమంలోనే థియేటర్ లో ఎప్పుడో రిలీజ్ అయినా ఓ సినిమా.. ఎట్టకేలకు ఓటీటీ లోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

కొన్ని సినిమాలు ఎందుకో థియేటర్లో రిలీజ్ అయ్యి ఏ టాక్ తెచ్చుకున్న కూడా.. ఓటీటీ లోకి రావడానికి మాత్రం చాలా సమయం తీసుకుంటాయి. ఈ క్రమంలోనే థియేటర్ లో ఎప్పుడో రిలీజ్ అయినా ఓ సినిమా.. ఎట్టకేలకు ఓటీటీ లోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

చాలా సినిమా థియేటర్ లో మంచి టాక్ సంపాదించుకోకపోయినా ఓటీటీ లో మాత్రం హిట్ టాక్ తో దూసుకుపోతుంటాయి. ఓటీటీ ట్రెండ్స్ లో ఇది ఓ వైపైతే.. మరో వైపు థియేటర్ లో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సినిమాలు ఓటీటీ లోకి రాడానికి చాలా సమయం తీసుకుంటాయి. ఇది ఓటీటీ ట్రెండ్స్ లో ఉన్న మరొక కోణం. అయితే ఈ సినిమాలు ఇలా అవ్వడానికి కారణాలు అయితే తెలీదు కానీ.. ఆయా సినిమాలు ఆలస్యంగా వచ్చినా.. త్వరగా వచ్చినా కథను బట్టి మాత్రమే ప్రేక్షకులు ఆ సినిమాలను హిట్ చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఈ క్రమంలో తాజాగా మరొక స్టార్ హీరో సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన ఆరున్నరేళ్ల తర్వాత ఓటీటీ లోకి రానుందని.. ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అధికారికంగా ప్రకటించింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఆ సినిమా ఏదంటే.. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన “ప్రాజెక్ట్ జెడ్”. ఈ సినిమా 2017 లో తమిళంలో మాయావన్ అనే పేరుతో తెరకెక్కించాడు. తెలుగులో ఇదే సినిమాను ప్రాజెక్ట్ జెడ్ అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాను ఓటీటీ లోకి మాత్రం రిలీజ్ చేయలేదు. దానికి గల కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఆరున్నరేళ్ల తర్వాత ఈ సినిమాను ఓటీటీ లోకి తీసుకుని వస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు.. ఆహ ప్లాట్ ఫార్మ్ అధికారికంగా ప్రకటించింది. ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ.. ఆహా లో మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే ఆహా ప్లాట్ ఫార్మ్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించనుంది.

ఇక ప్రాజెక్ట్ జెడ్ సినిమా విషయానికొస్తే.. 2017 లో విడుదలైన ఈ సినిమాలో.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. వారితో పాటు ఈ సినిమాలో.. జాకీ ష్రాఫ్, డానియెల్ బాలాజీ, మైమ్ గోపీ, ఆమరేంద్రన్, భగవతి పెరుమాల్, జయప్రకాశ్, అక్షర గౌడ, కేఎస్ రవికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీవీ కుమార్ దర్శకత్వం వహించారు. థియేటర్ లో ఈ సినిమాకు యావరేజ్ కలెక్షన్స్ లభించాయి. మరి ఓటీటీ లో రిలీజ్ తర్వాత ఈ సినిమాకు ఎటువంటి టాక్ వస్తుందో వేచి చూడాలి. ఇక సందీప్ కిషన్ విషయానికొస్తే.. విభిన్నమైన కథల ఎంపికతో సందీప్ మంచి పాత్రలను పోషిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల సందీప్ “ఊరు పేరు భైరవ కోన” చిత్రంతో మంచి సక్సెస్ సాధించాడు. మరి ప్రాజెక్ట్ జెడ్ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments