P Krishna
Prabuthwa Junior Kalashala Movie OTT Streaming: ఈ మధ్య కాలంలో ఓటీటీ పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఇంట్లో కూర్చుని చూసే అవకాశం లభిస్తుంది. కొత్త సినిమాలు ధియేటర్లో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.
Prabuthwa Junior Kalashala Movie OTT Streaming: ఈ మధ్య కాలంలో ఓటీటీ పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఇంట్లో కూర్చుని చూసే అవకాశం లభిస్తుంది. కొత్త సినిమాలు ధియేటర్లో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.
P Krishna
ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. ఒకప్పుడు ధియేటర్ల వద్ద క్యూ లైన్లో నిల్చుని టికెట్ తీసుకొని సినిమా చూస్తే ఆ మజా వేరే లెవెల్ లో ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది.. టెక్నాలజీ పుణ్యమా అని చాలా మంది సినీ లవర్స్ ధియేటర్లకు వెళ్లడం మాని ఇంట్లోనూ హ్యాపీగా ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలైతే నెల లోపే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. మరికొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా టీనేజ్ క్యూట్ లవ్ స్టోరీ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడ యూత్ ఫుల్ లవ్ స్టోరీస్, యాక్షన్, హర్రర్, కామెడీ తరహా చిత్రాలకు విపరీతమైన క్రేజ్ లభిస్తుంది. అలాంటి ఓ క్యూట్ లవ్ స్టోరీ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ మూవీ గతంలో వచ్చిన ఎన్నో యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. ఈ మూవీలో కొన్ని సిన్లు గతంలో చూసిన మాదిరిగా ఉన్నా.. థియేటర్లో కూర్చొని చూసిన వారికి ఒక ఫీల్ గుడ్ కలుగుతుంది. చూస్తున్నంత సేపు ఎంటర్‌టైనింగ్‌గా మంచి టైమ్ పాస్ అవుతుందని అంటున్నారు. శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో ప్రణవ్ సింగంపల్లి, షగ్న శ్రీ వేణున్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ మూవీకి భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రిగ్యెజ్ సంగీతం బాగానే ఆకట్టుకుంది.
శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో ప్రణవ్ సింగంపల్లి, షగ్న శ్రీ వేణున్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ మూవీకి భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రిగ్యెజ్ సంగీతం బాగానే ఆకట్టుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. 2004 లో రాయలసీమలో పుంగనూరు అనే ఊరిలో వాసు అనే కుర్రాడు ఇంటర్ చదువుతుంటాడు. అదే కాలేజ్ లో చదువుతున్న కుమారి అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె గురించి కొన్ని విషయాలు తెలిసిన తర్వాత వాసు.. కుమారితో గొడవ పడతాడు. అంతే కాదు ఏకంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు.. ఇంతకీ వాసు కి కుమారి గురించి తెలిసిన విషయం ఏంటీ? వీరిద్దరి లవ్ స్టోరీ చివరికి ఏమవుతుంది? అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా 90లో పుట్టి పెరిగిన వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది. గతంలో తమకు జరిగిన జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే విధంగా సినిమాల్లో కొన్ని సీన్లు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇంటర్ లో లవ్ లో పడి ఉంటే ఆ ప్రేమ మళ్లీ గుర్తుకు వస్తుంది.