iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్.. ఎక్కడ చూడొచ్చంటే

  • Published Jan 05, 2024 | 11:09 AM Updated Updated Jan 05, 2024 | 11:35 AM

#90s Web Series OTT: సీనియర్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ, వాసుకీ ఆనంద్ నంటించిన 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది అంటే..

#90s Web Series OTT: సీనియర్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ, వాసుకీ ఆనంద్ నంటించిన 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది అంటే..

  • Published Jan 05, 2024 | 11:09 AMUpdated Jan 05, 2024 | 11:35 AM
OTTలోకి వచ్చేసిన 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్.. ఎక్కడ చూడొచ్చంటే

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. వెండి తెర స్టార్లు సైతం.. ఓటీటీల్లో మెరిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలానే సీనియర్ హీరోయిన్లు, హీరోలు సైతం.. కమ్ బ్యాక్ కోసం ఓటీటీల పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే నాగ చైతన్య నటించిన దూత వెబ్ సిరీస్.. ఓటీటీల్లో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్ హీరో శివాజీ, ‘తొలిప్రేమ’ ఫేమ్ వాసుకీ ఆనంద్ కూడా ఓటీటీ బాట పట్టారు. వీరిద్దరితో పాటు సాయి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ’90స్’ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కింది.

ఇది ఈటీవీ విన్ యాప్ ఒరిజినల్ సిరీస్. చాలా కాలం గ్యాప్ తర్వాత ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో శివాజీ. బిగ్ బాస్ 7 తెలుగు ద్వారా మొన్నటివరకు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన శివాజీ త్వరలో వెబ్ సిరీస్ ’90స్’ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు అనగా జనవరి 5న ’90స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈటీవీ విన్ ఒరిజినల్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ప్రసారం అవుతుంది. సో చక్కగా ఎంజాయ్ చేయండి.

ఇప్పటికే రిలీజైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 90స్ కాలం నాటి వారికి ఇది విపరీతంగా నచ్చింది. నాడు కుటుంబంలో రిలేషన్స్ ఎలా ఉండేవి.. తల్లితో, తండ్రితో పిల్లలకు సంబంధాలు ఎలా ఉండేవి.. సమాజం ఎలా ఉండేది వంటి పరిస్థితులను అన్నింటిని ఈ వెబ్ సిరిస్ లో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దాంతో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్.. ప్రేక్షకులకు తెగ నచ్చింది. దీనిపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.

హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ ’90స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్ సిరిస్‌ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం సమర్పిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌లో శివాజీ గురించి అతడి కొడుకు తన క్లాస్‌మేట్‌కు వివరించే సీన్‌తో ఆరంభమై ఆద్యంతం నవ్వులు పంచింది. శివాజీ లెక్కల మాస్టర్‌ చంద్రశేఖర్‌‌గా అలరించారు. శివాజీ కుటుంబం, ఇల్లు, స్కూల్‌లో పిల్లల అల్లరి .. ప్రతీ అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంది..

అలానే ట్రైలర్ లో ‘మన కోసం మనతో కొట్లాడి నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ..’ అంటూ శివాజీ చెప్పిన డైలాగ్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, అలనాటి అందమైన జ్ఞాపకాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల అనందాలు, సరదాలు, సంఘర్షణలని ఎంతో అందంగా మనసుకు హత్తుకునేలా ట్రైలర్‌లో చూపించి.. 90స్ బయోపిక్ మీద అంచనాలు పెంచారు మేకర్స్.

Jojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetlunabetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş