90’s -మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్టర్ ఇతనే.. కన్నీరు పెట్టించేలా మాట్లాడాడు!

ఇటీవల ఓటీటీలోకి వచ్చి అలరించిన వెబ్ సిరీస్ 90’s -మిడిల్ క్లాస్ బయోపిక్. ప్రతి ఒక్కరికి కనెక్ట్ చేసిన ఈ మూవీ మంచి రివ్యూస్ రాబట్టుకుంటుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే సాధకబాధలు ఈ సిరీస్ లో చూపించాడు దర్శకుడు.

ఇటీవల ఓటీటీలోకి వచ్చి అలరించిన వెబ్ సిరీస్ 90’s -మిడిల్ క్లాస్ బయోపిక్. ప్రతి ఒక్కరికి కనెక్ట్ చేసిన ఈ మూవీ మంచి రివ్యూస్ రాబట్టుకుంటుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే సాధకబాధలు ఈ సిరీస్ లో చూపించాడు దర్శకుడు.

థియేటర్ల కోసం కాకుండా ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొన్ని సినిమాలు, వెబ్ సిరిస్‌లు పుట్టుకొస్తున్నాయి. అలాగే అలరిస్తున్నాయి. ఇటీవల నేరుగా ఓటీటీలోకి వచ్చి.. అందరి ప్రశంసలు అందుకుంటున్న వెబ్ సిరిస్‌ 90’s -మిడిల్ క్లాస్ బయోపిక్. శివాజీ, వాసుకి, మౌలాలి, వాసంతిక, రోషన్ కీలక పాత్రలు పోషించారు. 90 నాటి మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ఆనందాలు, సమస్యలు ఎంతో చక్కగా చూపించాడు దర్శకుడు ఆదిత్య హాసన్. కుటుంబమంతా ఒకే చోట కూర్చుని హాయిగా చూసే చిత్రంగా మంచి ఆదరణ అందుకుంటుందీ ఈ వెబ్ సిరీస్. ఈటీవీ విన్‌లో జనవరి 5 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో తమను తాము చూసుకుంటున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరూ.

అయితే ఈ మూవీ విడుదలకు ముందు ఆదిత్య హాసన్.. తాను ఎదుర్కొన్న సమస్యలను ఇటీవల వెల్లడించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ‘ ఈ సందర్భంగా నవీన్ మేడారం (నిర్మాత) థ్యాంక్స్. నేను కథ చెప్పగానే బ్యాగ్ తీసుకుంటే.. ఏటో వెళ్లిపోతున్నాడు అనుకున్నా.. చెక్ తీసి.. 100 శాతం వెబ్ సిరీస్ చేస్తున్నాం అని చెప్పాడు. కథ తీసుకుని చాలా ఓటీటీ సంస్థలను కలిశాం. వాళ్లకు నచ్చలేదు. వాళ్లకు చాలా రీజన్స్ ఉంటాయి. మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘటనలు.. సినిమాల్లో చూపించాం. వాటిని బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పారు నవీన్. ఆయనకు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కొన్ని ఓటీటీలకు వెళితే.. వర్కౌట్ కాలేదు. ఈటీవీ విన్ పిలిచి ఛాన్స్ ఇచ్చింది’ అని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.

ఈ వెబ్ సిరిస్‌ కి మ్యూజిక్ అందించిన సురేష్ బొబ్బిలి.. తనను ఎప్పుడూ అప్రిసియేట్‌ చేస్తూ ఉండేవాళ్లని తెలిపారు. ఇక ఈ వెబ్ సిరీస్ నిర్మాత.. తనను రెండు సంవత్సరాలు తనను సాకాడని, ఏదీ అంటే అది తినిపించాడని, తనను మంచిగా సినిమా చేయాలని సపోర్టుగా నిలిచాడని చెప్పారు. ఈ వెబ్ సిరీస్ నటీనటుల గురించి మాట్లాడుతూ.. రోహన్.. ఈ షో వెబ్ సిరీస్ స్టీల్ చేశాడడంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. ‘వాసుకి నన్ను అక్కలాగా. నన్ను ఇన్ స్పైర్ చేశారు. శివాజీతో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నారు. ఆయనొక స్వీట్ హార్ట్’ అని చెప్పారు. తన సినిమా కెరీర్‌కు కారణమయైన అశోక్ అనే వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు.

Show comments