iDreamPost
android-app
ios-app

OTT Releases: ఈవారం టాప్ 7 ఓటీటీ రిలీజ్ సినిమాలివే.. ఆ రెండే ప్రత్యేకం

  • Published Apr 11, 2024 | 8:10 AM Updated Updated Apr 11, 2024 | 8:48 AM

ఈ వీకెండ్ లో ఓటీటీలోకి 7 సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. వీటిల్లో రెండు సినిమాల మీదనే అందరికి ఆసక్తి నెలకొని ఉంది. ఆ వివరాలు..

ఈ వీకెండ్ లో ఓటీటీలోకి 7 సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. వీటిల్లో రెండు సినిమాల మీదనే అందరికి ఆసక్తి నెలకొని ఉంది. ఆ వివరాలు..

  • Published Apr 11, 2024 | 8:10 AMUpdated Apr 11, 2024 | 8:48 AM
OTT Releases: ఈవారం టాప్ 7 ఓటీటీ రిలీజ్ సినిమాలివే.. ఆ రెండే ప్రత్యేకం

ఇప్పుడంతా ఓటీటీలదే హవా. ఎంత భారీ బడ్జెట్ చిత్రమైనా సరే.. థియేటర్లో విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఓటీటీలోకి రావాల్సిందే. అలా ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక ఈ వీకెండ్ కూడా ఓటీటీలో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. 7 మూవీలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతుండగా.. ఇందులో రెండు చిత్రాల కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చివరకు ఆ సినిమాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకు ఆ సినిమాలు ఏవి.. ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి. అంటే..

ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రెడీ అయిన సినిమాల్లో ప్రేమలు, గామి, ఓం భీమ్ బుష్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు అమర్ సింగ్ చమ్కీలా చిత్రం కూడా ఉంది. ఇది నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ లో నేరుగా రిలీజ్ కానుంది. పంజాబీ సింగర్, మ్యూజిషియన్ అమర్ సింగ్ చమ్కీలా జీవితంపై అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 12 నుంచి అమర్ సింగ్ చమ్కీలాను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

ప్రేమలు

మలయాళంలోనే కాక తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ అందుకుంది ప్రేమలు సినిమా. ఈ చిత్రం కూడా ఈవారంలోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. ప్రేమలు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 12న స్ట్రీమింగ్‍‍కు రానుంది. మళయాళం, తమిళం, హిందీ వెర్షన్ మాత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో రానుంది. అంది కూడా ఏప్రిల్ 12ననే కావడం విశేషం. నెస్లనే కే గూఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించిన ప్రేమలు చిత్రానికి గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు.

పొన్ ఒండ్రు కాందెన్

తమిళ సినిమా పొన్ ఒండ్రు కాందెన్ చిత్రం కూడా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతుంది. జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. ఏప్రిల్ 14న ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అశోక్ సెల్వన్, వసంత్ రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.

గామి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమా థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. గామి మూవీ ఏప్రిల్ 12వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

లాల్ సలామ్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలకపాత్ర పోషించిన లాల్ సలామ్ సినిమా ఏప్రిల్ 12వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రజనీకాంత్ నటించిన ఈ సినిమా థియేటరల్లో పెద్దగా ఆకట్టుకోలేదు.

ఓం భీమ్ బుష్

శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో పోషించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ ఓం భీమ్ బుష్ మార్చి 22న థియేటర్లలో విడుదలై విజయం సాధించింది. నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

శర్మ అండ్ అంబానీ

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘శర్మ అండ్ అంబానీ’ చిత్రం కూడా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కార్తీక్ సాయి దర్శకత్వం వహించారు.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique