iDreamPost
android-app
ios-app

OTT: రేపు ఒక్క రోజే OTTలోకి 19 సూపర్‌ హిట్‌ సినిమాలు !

  • Published Dec 07, 2023 | 9:43 AM Updated Updated Dec 07, 2023 | 9:43 AM

రేపు ఒక్క రోజే ఏకంగా 19 సినిమాలు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సూపర్‌ హిట్‌ అయిన పలు సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

రేపు ఒక్క రోజే ఏకంగా 19 సినిమాలు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సూపర్‌ హిట్‌ అయిన పలు సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

  • Published Dec 07, 2023 | 9:43 AMUpdated Dec 07, 2023 | 9:43 AM
OTT: రేపు ఒక్క రోజే OTTలోకి 19 సూపర్‌ హిట్‌ సినిమాలు !

ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ల హవా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారు బాగా తగ్గిపోయారు. ఎలాగూ ఓటీటీకి వస్తుంది. ఇంట్లో కూర్చుని చూడొచ్చులే అన్న భావనతో హాళ్లకు వెళ్లటం మానేశారు. కొత్త కొత్త సినిమాలు, అది కూడా థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు తక్కువ కాలంలో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లకంటే ఓటీటీల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినిమాలు చూసే అవకాశం ఓటీటీలో ఉంటుంది. ఒక్కో సినిమాకు ప్రత్యేకంగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి.. రోజులో రెండు మూడు సినిమాలు చూసేస్తున్నారు.

ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు కూడా ప్రేక్షకుల అభిరుచులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. వారి మూడ్‌ను బట్టి నడుచుకుంటున్నాయి. సినిమాలను వీలైనంత తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్‌ చేయడానికి చూస్తున్నాయి. ప్రతీ రోజు కొత్త కొత్త సినిమాలను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఇక, రేపు ఒక్క రోజే ఏకంగా 18 సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ తదితర భాషల సినిమాలు రేపు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ :

  • జిగర్‌ తాండ డబుల్‌ ఎక్స్‌ – తెలుగు ( డిసెంబర్‌ 8)
  • అదృశ్య జలకంగల్‌ – తెలుగు ( డిసెంబర్‌ 8)
  • దక్‌ దక్‌ – హిందీ ( డిసెంబర్‌ 8)
  • ద ఆర్చీస్‌ – హిందీ ( డిసెంబర్‌ 8)
  • లీవ్‌ ది వరల్డ్‌ – ఇంగ్లీష్‌ ( డిసెంబర్‌ 8)

అమెజాన్‌ ప్రైమ్‌ :

  • మస్త్‌ మైన్‌ రహానే కా – హిందీ ( డిసెంబర్‌ 8)
  • మేరీ లిటిల్‌ బ్యాట్‌ మ్యాన్‌ – ఇంగ్లీష్‌ ( డిసెంబర్‌ 8)
  • యువర్‌ క్రిస్మస్‌ ఆర్‌ మైన్‌ 2 – ఇంగ్లీష్‌ ( డిసెంబర్‌ 8)
  • డేటింగ్‌ శాంటా – స్పానిష్‌ ( డిసెంబర్‌ 8)
  • సిల్వర్‌ అండ్‌ ద బుక్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ – జర్మన్‌ ( డిసెంబర్‌ 8)
  • టగరు పాళ్య – కన్నడ ( డిసెంబర్‌ 8)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ :

  • వధువు – తెలుగు సిరీస్‌ ( డిసెంబర్‌ 8)
  • డైరీ ఆఫ్‌ ఏ వింకీ కిడ్‌ క్రిస్మస్‌ : క్యాబిన్‌ ఫీవర్‌ – ఇంగ్లీష్‌ ( డిసెంబర్‌ 8)

జీ 5 :

  • కడక్‌ సింగ్‌ – హిందీ ( డిసెంబర్‌ 8)

మనోరమ మ్యాక్స్‌:

  • అచనోరు వళ వెచు ( డిసెంబర్‌ 8)

బుక్‌ మై షో : 

  • ఫైవ్‌ నైట్స్‌ ఏట్‌ ఫ్రెడ్డిస్‌ – ఇంగ్లీష్‌ ( డిసెంబర్‌ 8)

లయన్స్‌ గేట్‌ ప్లే :

  • డిటెక్టివ్‌ నైట్‌ : రెడంప్చన్‌ – ఇంగ్లీష్‌ ( డిసెంబర్‌ 8)

ఆహా :

  • మా ఊరి పొలి మేర 2 – తెలుగు ( డిసెంబర్‌ 8)
  • కీడా కోలా – తెలుగు ( డిసెంబర్‌ 8)

మరి, రేపు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌ అవ్వనున్న ఈ సినిమాల లిస్టులో మీ ఫేవరేట్‌ సినిమా ఏదో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabettaraftarium24 girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom