iDreamPost
android-app
ios-app

వీడియో: సైకిల్ నడుపుతున్న భార్య.. చంకలో పిల్లాడితో భర్త!

వీడియో: సైకిల్ నడుపుతున్న భార్య.. చంకలో పిల్లాడితో భర్త!

సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో  ఎక్కడ, ఏం  జరిగిన క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై  ఎన్నోరకాల వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఢిల్లీ మహిళ కమిషన్ ఛైరపర్సన్ స్వాతీ మాలవీయ్ తన  ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో నిజమైన ప్రేమానురాగాలు కలిగిన దంపతులు కనిపిస్తున్నారు. ఈ వీడియో షేర్ చేసిన ఆమె…”నువ్వుండగా నాకేం కావాలి?అనే పాటకు ఈ వీడియో ఓరిజనల్ గా ఉండాలి” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతీ మాలవీయ్ షేర్ చేసిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి జొమాటో డెలివరీ భాయ్ గా పని చేస్తున్నాడు. అతడు తన విధులను ముగించుకుని చీకటి పడ్డాక భార్య, బిడ్డతో పాటు ఇంటికి వెళ్తున్నాడు. జొమాటో ధరించిన  సదరు వ్యక్తి చంకలో పిల్లాడిని ఎత్తుకుని నడుస్తున్నాడు. అదే సమయంలో అతడి భార్య.. సైకిల్ హ్యాండిల్ పట్టుకుని దానిని ముందుకు నడుపుతుంది. కుటుంబం కోసం కష్టపడుతున్న భర్త, అతడికి సాయం అందిస్తున్న భార్యతో కూడిన ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక ఈ వీడియో చూసినట్ల అయితే.. డెలివరీ భాయ్ భార్య కూడా  పిల్లాడితో పనికి వెళ్లినట్లు అర్థమవుతుంది. అలానే భర్త సైకిల్ పై జొమోటా ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు.

ఇక వీరిద్దరు విధులు ముంగించుకుని సాయంత్రం వేళ కలిసి ఇంటికి బయలుదేరారు. భర్త చేతిలో సైకిల్ భార్య తీసుకోగా, భార్య చంకలోని బిడ్డను భర్త తీసుకున్నాడు. ఇలా ఇద్దరు ఒకరికొక్కరు తోడు నీడగా ఉంటున్నారు. స్వాతి మాలవీయ్ షేర్ చేసిన ఈ పోస్టుకు కొద్ది గంటల వ్యవధిలోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. అలానే లైక్స్ కూడా భారీగానే వచ్చాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique