ఈ కుక్క ఎంత హైట్ ఉందో చూడండి.. ఏకంగా గిన్నిస్ రికార్డ్ ఇచ్చేశారు..

కుక్కని మనమంతా పెంచుకోవడానికి ఇష్టపడతాము. కుక్కలు మనుషులతో స్నేహంగా ఉంటాయి, అలాగే విశ్వసంగా కూడా ఉంటాయి. అయితే కుక్కల్లో చాలా రకాలు, జాతులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు తమకు నచ్చిన ఒక్కో రకమైన కుక్కని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్లో చాలా ఎత్తుగా ఉండే కుక్కలు కూడా మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఓ కుక్క తన ఎత్తుతో ఏకంగా గిన్నిస్ రికార్డ్ సృష్టించింది.

పెంపుడు కుక్కల్లో ఎతైన కుక్కగా అమెరికాకు చెందిన ”జుయస్”(Zeus) అనే కుక్క గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. కేవలం రెండేళ్ల వయసున్న ”జుయస్”(Zeus) 3 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే ఎతైన మగ కుక్కగా నిలిచింది అని చెప్తూ దానికి గిన్నిస్ బుక్ లో స్థానం కల్పించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర బెడ్ ఫోర్డ్ కి చెందిన బ్రిటనీ డేవిస్ కుటుంబం ఈ కుక్కను పెంచుకుంటుంది. అమెరికన్ గ్రేట్ డేన్ జాతికి చెందిన ఈ కుక్కలు మామూలుగా ఐదేళ్లకి కానీ ఇంత ఎత్తు పెరగవు, కానీ ఈ కుక్క మాత్రం రెండేళ్లకే మూడు అడుగులు పెరిగి రికార్డ్ కొట్టేసింది.

తమ పెంపుడు కుక్క జుయస్ గిన్నిస్ రికార్డు సాధించడం గురించి దీని యజమాని బ్రిటనీ డేవిస్ మాట్లాడుతూ.. మేము ఎక్కడికి వెళ్లినా అంతా జుయస్ నే చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇది కుక్కా, గుర్రమా అని అడుగుతూ ఉంటారు. ఇంత పెద్దగా ఉన్నా జుయస్ మాత్రం చాలా స్నేహంగా ఉంటుంది. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా దీనితో స్నేహంగా ఉంటారు. ఈ కుక్క అదే ఇంట్లో ఉండే మరో మూడు ఆస్ట్రేలియన్ షెఫర్డ్, ఒక పిల్లితో కూడా చాలా స్నేహంగానే ఉంటుందని తెలిపాడు.

Show comments