iDreamPost
android-app
ios-app

అంబానీల పెంపుడు శునకం ప్రయాణించే కారు ఇదే..ఖ‌రీదు ఎన్ని కోట్లంటే?

  • Published Jul 18, 2024 | 6:45 PM Updated Updated Jul 18, 2024 | 6:45 PM

Mukesh Ambani: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా వారి పెంపుడు శునకమైన హ్యాపీ ప్రయాణించిన కారు అందరిని ఆకర్షించింది. దాని ధర ఎంతంటే...

Mukesh Ambani: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా వారి పెంపుడు శునకమైన హ్యాపీ ప్రయాణించిన కారు అందరిని ఆకర్షించింది. దాని ధర ఎంతంటే...

  • Published Jul 18, 2024 | 6:45 PMUpdated Jul 18, 2024 | 6:45 PM
అంబానీల పెంపుడు శునకం ప్రయాణించే కారు ఇదే..ఖ‌రీదు ఎన్ని కోట్లంటే?

చాలా మందికి మూగ జీవాలను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే కుక్కలను, పిల్లులు, కుందేలు వంటి పలు మూగజీవాలను తమ ఇళ్లలో పెంచుకుంటారు. ఎక్కువగా శునకాలను పెంచుకుంటారు. ఇదే సమయంలో మనుషుల్లో ఎలా ఆర్థిక అసమానతలు ఉంటాయో..కుక్కలు పెరిగే ప్రాంతాలను బట్టీ వాటి లైఫ్ ఉంటుంది. కొన్ని వీధుల్లో కష్టాలు పడుతుంటే..మరికొన్ని శునకాలు మాత్రం ధనవంతుల ఇళ్లలో రాజభోగాలు అనుభవిస్తుంటాయి. అలానే అంబానీ ఇంట్లోని పెంపుడు కుక్క ప్రత్యేకంగా కారు ఉంది. ఆ కారు ధర తెలిస్తే.. షాకవ్వకుండా ఉండలేరు. మరి.. అంబానీ ఇంట్లోని కుక్క ప్రయాణించే కారు ధర ఎంతో ఇప్పుడు చూద్దాం…

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని వివిధ ప్రముఖులు, కుంబేరులు, సినీ స్టార్స్  హాజరయ్యారు. ఇక అనంత్ అంబానీ  రాధిక మర్చెండ్ ల వివాహ వేడుక జరిగిరిన తీరు నభూతో న భవిష్యత్ అన్నట్టు  జరిగింది. వీరి వివాహనికి సంబంధించిన వేడుకలు ఐదు నెలలుగా సోషల్ మీడియాలో ట్రేండింగ్గా మారింది. అంతేకాక వారి పెళ్లిలో ఏర్పాటు చేసిన విధులు, వారు ధరించిన దుస్తువులు అన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాజాగా అంబానీ ఫ్యామిలీ నుంచి మారో న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

నూతన దంపతులైన అనంత్ అంబానీ రాధికా మర్చంట్ లతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిసి భారీగా అలంకరించిన రోల్స్ రాయిస్ ఎస్680 మేబ్యాక్ కార్లలో వేదిక వ‌ద్ద‌కు వచ్చారు. ఇలాంటి రిచ్ స్టేటస్ కేవలం అంబానీ కుటుంబ సభ్యుల కోసం మాత్ర‌మే కాదండోయ్.. వారు పెంచుకునే కుక్క కూడా ఉంది. అంబానీ ఇంట్లో పెరిగిన ఆ శునకం పేరు  గోల్డెన్ రిట్రీవర్  హ్యాపీ. దీని కోసం కూడా ప్రత్యేకమైన విలాసవంతమైన కారును ఏర్పాటు చేశారు. అలా ఖరీదైన కారులో వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆ శునకం అందరిని ఆకర్షించింది. అయితే..వారి హ్యాపీ (కుక్క) హ్యాపీగా ప్రయాణించిన ఆ కారు ధర గురించి అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆ కారు ధర రూ.4 కోట్ల ఉంటుందని సమాచారం. ఈ హ్యాపీ ప్రయాణించే కారు మెర్సిడెస్ బెంజ్  జీ400డీ ఖరీదు అక్షరాల రూ.4 కోట్లు అంట.

ప్రస్తుతం అంబానీ ప్లాట్ లో కట్టుదిట్టమైన భద్రత కోసం జీ63ఏఎంజీ అత్యాధునికమైన హై-ఎండ్ వాహనాలు ఉన్నాయి. వీటిలోలో ఒకటైన జీ400డీ కారు  ప్రత్యేకంగా హ్యాపీ(కుక్క) కోసం కొనుగోలు చేశారు. గతంలో ఈ హ్యాపీ కోసం టయోటా ఫార్చ్యూనర్, టయోటా వెల్‌ఫైర్‌ను వినియోగించారు. కానీ ఇప్పుడు జీ400డీ కారులో ప్రయాణిస్తూ తన రాజ‌సాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం ఈ హ్యాపీ ప్రయాణించిన కారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని పేరే హ్యాపీ..దాన్ని పనే హ్యాపీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss