iDreamPost
android-app
ios-app

Chandu Sai: అబ్బాయిలు అందరికీ నా జీవితం ఒక పాఠం కావాలి: చందుసాయి ఎమోషనల్!

  • Published Feb 23, 2024 | 4:20 PM Updated Updated Feb 23, 2024 | 4:20 PM

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినా చాలా మంది స్టార్స్ వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం యూట్యూబ్ లో ఫేమస్ అయిన యూట్యూబర్ చందు సాయి అరెస్ట్ గురించి తెలిసిన విషయమే. ఇక తాజాగా ఆ విషయంలో స్పందిస్తూ చందు సాయి కొన్ని కీలక కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినా చాలా మంది స్టార్స్ వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం యూట్యూబ్ లో ఫేమస్ అయిన యూట్యూబర్ చందు సాయి అరెస్ట్ గురించి తెలిసిన విషయమే. ఇక తాజాగా ఆ విషయంలో స్పందిస్తూ చందు సాయి కొన్ని కీలక కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 23, 2024 | 4:20 PMUpdated Feb 23, 2024 | 4:20 PM
Chandu Sai: అబ్బాయిలు అందరికీ నా జీవితం ఒక పాఠం కావాలి: చందుసాయి ఎమోషనల్!

ప్రస్తుతం అందరు ఉదయం లేచింది మొదలు ఆరోజు పూర్తయ్యేవరకు .. దాదాపు వారి సమయాన్ని ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది రోజు రోజుకి ఫేమస్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పక్కింటి కుర్రాడిగా ఫేమస్ అయినా.. చందు సాయి అందరికి గురించి అందరికి తెలిసిందే. అలానే కొన్ని నెలల క్రిందట.. ఓ అమ్మాయి కేసు విషయంలో ఇతను అరెస్ట్ అయినా సంగతి కూడా అందరికి తెలిసిందే. అప్పటివరకు ఇతనిపై ఎటువంటి ట్రోలింగ్స్ లేకపోయినప్పటికీ .. ఒక అమ్మాయి ఇతనిపై అత్యాచారం, మోసం పేరిట 420 కేసులు పెట్టడంతో.. ఇతనిపై ఒక్కసారిగా అందరి ద్రుష్టి పడింది. ఆ తర్వాత ఇతనిపై ఎన్నో ట్రోలింగ్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా వాటి అన్నింటిపై స్పందిస్తూ.. ఆ సమయంలో ఏర్పడిన వివాదాల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు చందు సాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చందుసాయి .. కొన్ని నెలల క్రితం జరిగిన తన అరెస్ట్ పై .. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టి .. తన కడుపుపై కొట్టారని వాపోయాడు. దాదాపు 27రోజుల పాటు అన్యాయంగా జైలు జీవితాన్ని గడపవలసి వచ్చిందని .. తానూ ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ, తామిద్దరూ లివ్ ఇన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ, ఏ అమ్మాయితో అయితే లివ్ ఇన్ లో ఉన్నాడో .. అదే అమ్మాయి తనపై కోపం పెంచుకుని..కావాలని కేసు పెట్టినట్లు వ్యక్తపరిచాడు చందు సాయి. ఏదైనా తప్పు చేస్తే కేసు పెట్టడం ఓకే .. కానీ అత్యాచారం, 420 లాంటి కేసులు పెట్టడానికి బలమైన కారణాలు కావాలంటూ .. తన తప్పు మాత్రమే ఉన్నట్లు కావాలనే తనపై ఈ కేసు పెట్టారని వాపోయాడు.

అలాగే లివ్ ఇన్ రిలేషన్స్ పై యూత్ కు సలహాలు ఇస్తూ.. “అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లివ్ ఇన్ రిలేషన్ లాంటివి పెట్టుకోకండి, తప్పు జరిగిందంటే అది ఇద్దరు చేసినట్టే. కానీ, దెబ్బ అబ్బాయిలకే పడుతుంది. ఇప్పుడు సొసైటీ అలాగే ఉంది. ఒకవేళ ప్రేమించకపోయినా, 420 పనులు, రేప్ లు లాంటివి మనమెందుకు చేస్తాము, లివింగ్ లో ఇద్దరూ ఉన్నాము, కాపాడుకోవాలని చూశాను. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, అయితే వాళ్ళు దానిని తప్పుగా తీసుకుని.. నాపైన కేసు వేశారు.” అంటూ చెప్పుకొచ్చాడు చందు సాయి. ఏదేమైనా లివ్ ఇన్ అయినా , లేక అది ఏ రిలేషన్ అయినా సరే ఈరోజుల్లో.. దేనిని నమ్మడానికి లేకుండా పోతుంది. కాబట్టి యువత దీనిపట్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది. మరి, యూట్యూబర్ చందు సాయి .. తన అరెస్ట్ విషయంలో ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş