iDreamPost
android-app
ios-app

బావ‌ను ఒక్క‌వేటు వేయ‌డానికి, కోర్టులోకి క‌త్తిప‌ట్టుకొని…

  • Published May 25, 2022 | 5:35 PM Updated Updated May 25, 2022 | 5:35 PM
  • Published May 25, 2022 | 5:35 PMUpdated May 25, 2022 | 5:35 PM
బావ‌ను ఒక్క‌వేటు వేయ‌డానికి, కోర్టులోకి క‌త్తిప‌ట్టుకొని…

బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ యువకుడు క‌త్తితో క‌ల‌క‌లం సృష్టించాడు. సాయికిర‌ణ్ అనే యువ‌కుడు క‌త్తితో కోర్టు లోప‌లికి ప్ర‌వేశించాడు. అత‌ని వెంట స్నేహితులు కూడా ఉన్నారు. అయితే సాయికిర‌ణ్ క‌త్తి పట్టుకొని కోర్టులో తిర‌గ‌డాన్ని సెక్యూరిటీ సిబ్బంది చూసి అక్కడే ఉన్న పోలీసులకి చెప్పడంతో అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ఇలా కత్తి పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు కోర్టులో అని ప్రశ్నించగా హత్య చేసేందుకు వచ్చాను అని సాయి చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు. సాయికిర‌ణ్ సోద‌రిని ఓ వ్య‌క్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులకే అతడు సాయి కిరణ్ సోదరిని మోసం చేసి వదిలేశాడు. దీనికి సంబంధించిన కేసు కొన్ని రోజులుగా కోర్టులో విచారణ సాగుతుంది.

బుధవారం ఉదయం కూడా ఈ కేసు విచారణ ఉండ‌టంతో అత‌ను కోర్టుకు వ‌చ్చాడు. తన చెల్లెల్ని మోసం చేసిన వాడు కోర్టుకు వచ్చాడని తెలుసుకొని అతన్ని చంపేందుకు కత్తితో వచ్చాడు సాయి కిరణ్. ఈ లోపే కోర్టు సిబ్బంది, పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఈ విషయం చెప్పడంతో పోలీసులు సాయి కిరణ్ తో పాటు అతని బావని కూడా అదుపులోకి తీసుకున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş