Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలను తెలుసుకుని, వారికి తానున్నానన్న భరోసాను ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వైఎస్ జగన్ 2017, నవంబర్ 6న ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 14 నెలల పాటు ప్రజల్లోనే ఉన్న ఆయన, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, 2019 జనవరి 9వ తేదీన ఇచ్చాపురం చేరుకుని, 3,648 కిలోమీటర్ల దూరాన్ని నడిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ప్రజా సంకల్పయాత్రలో, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థన ప్రజల్లోకి చొచ్చుకెళ్లి, తదుపరి జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెట్టింది. అనూహ్యరీతిలో 151 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, అదే సంవత్సరం మే 30న ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక నాటి నుంచీ తనకు అవకాశం కల్పించిన ప్రజల బాగు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు.
నాడు చెప్పింది – నేడు మరిచి పోకుండా..
సాధారణంగా రాజకీయ నాయకులకు మాట ఇవ్వటమే కానీ నెరవేర్చరనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. కానీ మాట ఇస్తే ముందుకే.. అన్న ఖ్యాతి వైఎస్సార్ కుటుంభానికి ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి ఎంత కైనా తెగించే వారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్ తండ్రికి మించిన తనయుడిగా గుర్తింపు పొందుతున్నారు. ప్రతి కూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుని నవరత్నాల అమలులో ముందుకే వెళ్తున్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేరుస్తూ వెళ్తున్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమం లో జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా.. సరిదిధాల్సిన లోటు పాట్లు ఏ మైనా ఉన్నాయా తెలుసు కోవడానికి వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తున్నాయి. నాడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. నేడు పాదయాత్ర పేరుతో వైసీపీ ప్రజల్లోకి వెళ్తోంది. పథకాలు చేకూర్చిన లబ్దిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల బాగోగులు పర్యవేక్షిస్తున్నారు.