iDreamPost
android-app
ios-app

వైసిపి నేత హత్య.. పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేపై రాళ్ళ దాడి..

వైసిపి నేత హత్య.. పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేపై రాళ్ళ దాడి..

గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత ఈ రోజు ఉదయం 7 గంటలకు హత్యకు గురయ్యారు. కాగా, పరామర్శకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై ప్రత్యర్థి వర్గం దాడికి యత్నించింది.

జి. కొత్తపల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్‌ గంజి ప్రసాద్‌పై కొందరు దుండగులు కత్తితో దాడిచేసి హత్య చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌ చేరుకోగా, ప్రత్యర్థివర్గం ఎమ్మెల్యేపై ఒక్కసారిగా దాడికి యత్నించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో వలయంగా ఏర్పడి.. ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి.

వ్యక్తిగత కారణాలా? ఆస్తి వివాదాలా? లేదంటే రాజకీయ వైరంతోనే గంజి ప్రసాద్‌ను హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş