iDreamPost
android-app
ios-app

రాజీనామాపై అన్నీ ఊహాగానాలేన‌ట‌! క‌ర్నాట‌క క‌థ సుఖాంత‌మైన‌ట్లేనా?

రాజీనామాపై అన్నీ ఊహాగానాలేన‌ట‌! క‌ర్నాట‌క క‌థ సుఖాంత‌మైన‌ట్లేనా?

కర్ణాటక ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప ను ఆ ప‌ద‌వి నుంచి మార్చాల‌ని ఓ వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తోంద‌ని, అందుకు అధిష్ఠానం కూడా సిద్ధంగానే ఉంద‌న్న వార్త‌లు చాలా రోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. కొన్ని కండీష‌న్స్ మీద రాజీనామా చేసేందుకు య‌డియూర‌ప్ప కూడా సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. అవ‌న్నీ ట్రాష్ అని కొట్టిపారేశారు సీఎం య‌డియూర‌ప్ప‌. రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న ఆయ‌న‌.. ప్ర‌ధాన న‌రేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జె.పీ.నడ్డా తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అదంతా పార్టీ అభివృద్ధి కోస‌మే కానీ.. త‌న ప‌ద‌విపై కాద‌ని తేల్చేశారు.

కేబినెట్ లో యడియూరప్ప ఓ వ‌ర్గానికి చోటు ఇవ్వలేద‌న్న ఆరోప‌ణ‌ల‌తో అసంతృప్తి మొద‌లైంది. గ‌తంలో పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర్ మాట్లాడుతూ “ఇది శుద్ధమైన బీజేపీ ప్రభుత్వంగా లేదు, మూడు గ్రూపుల సర్కారు మాదిరి ఉంది. మా ప్రభుత్వం కాంగ్రెస్, జేడీఎస్‌లతో కుమ్మక్కయ్యింది” అని విమర్శించారు. అప్ప‌టి నుంచీ ప్ర‌భుత్వంపైన‌, య‌డియూర‌ప్ప పైనా అడ‌పాద‌డ‌పా విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. దీంతో ఆయ‌న సొంత పార్టీలోని రెబల్ నాయకులను బుజ్జగించడానికి ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. వారికి అనుగుణంగా కొన్ని నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. దీంతో ప‌రిస్థితిలో కాస్త మార్పు వ‌చ్చిన‌ట్లుగానే తాజా ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి.

తన రాజీనామాను ఎవరూ కోరలేదని సీఎం య‌డియూర‌ప్ప తాజాగా స్ప‌ష్టం చేశారు. ఆరోగ్య కారణాలపై తాను రాజీనామా చేస్తానని బీజేపీ నేతలకు చెప్పానని వచ్చిన వార్తలు నిరాధారమన్నారు. పార్టీ అధ్యక్షుడు జె.పీ.నడ్డాకు తనపై మంచి అభిప్రాయం ఉందని, రాష్ట్రంలో పార్టీ పటిష్టత గురించి తాము చర్చించామని ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా ఎడ్యూరప్ప ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఆయన బహుశా రాజీనామా చేయవచ్చునన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయన నిన్న ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. అయితే కర్ణాటకలో జరగనున్న ఎన్నికల గురించి, పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం గురించి తాను మోదీ తోనూ, నడ్డాతోను చర్చించినట్టు ఆయన వెల్లడించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి అధికారంలోకి రావాలని నడ్డా కోరారని ఆయన చెప్పారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలు 2023 లో జరగవలసి ఉంది. కాగా రాష్ట్రంలో యెడ్యూరప్ప నాయకత్వాన్ని మార్చాలని అసమ్మతి వర్గం కొన్ని వారాలుగా గట్టిగా కోరుతోంది. ఆయన అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నారని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి యెడ్యూరప్ప ఢిల్లీకి రావడంతో ఈ ఊహాగానాలు మరింత బలం పుంజుకున్నాయి. మొత్తానికి ఆయన నాయకత్వానికి ఢోకా లేదని స్పష్టమైంది. రాష్టానికి సంబంధించిన సమస్యలను పార్టీ నేతలకు వివరించేందుకు తాను తరచూ ఢిల్లీకి వస్తుంటానని, మళ్ళీ వచ్చే నెలలో కూడా ఇక్కడికి వస్తానని ఆయన చెప్ప‌డంతో క‌ర్నాట‌క క‌థ‌ సుఖాంత‌మైన‌ట్లే క‌నిపిస్తోంది.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş