iDreamPost
android-app
ios-app

క‌ర్నాట‌క మాజీ సీఎం మ‌న‌వ‌రాలి ఆత్మ‌హ‌త్య‌

క‌ర్నాట‌క మాజీ సీఎం మ‌న‌వ‌రాలి ఆత్మ‌హ‌త్య‌

క‌ర్నాట‌క మాజీ సీఎం య‌డ్యూర‌ప్ప మ‌న‌వ‌రాలు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం బెంగుళూరులో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రెండో కుమార్తె కూతురే సౌంద‌ర్య (30). ఆమెకు 2018లో డాక్ట‌ర్ నీర‌జ్ తో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం జ‌రిగింది. ఎప్పుడూ ఎంతో చురుగ్గా ఉండే ఆమె కొంతకాలంగా డిప్రెష‌న్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. బెంగుళూరు వ‌సంత‌న‌గ‌ర్ లో ఓ అపార్ట‌మెంట్ లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

య‌డ్యూర‌ప్ప కూతురు ప‌ద్మావ‌తి కుమార్తె సౌంద‌ర్య‌. ఆమె కూడా డాక్ట‌ర్. ఈరోజు ఉద‌యం ప‌ది గంట‌ల స‌మ‌యంలో ఇంటి ప‌నిమనిషి వ‌చ్చి కాలింగ్ బెల్ కొడుతున్నా సౌంద‌ర్య త‌లుపు తీయ‌లేదు. దీంతో ఆమె భ‌ర్త నిరంజ‌న్ కు స‌మాచారం ఇచ్చారు. ఆయ‌న కూడా సౌంద‌ర్య ఫోన్ కు ప‌దే ప‌దే ఫోన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఫోన్ ఎత్త‌క‌పోవ‌డంతో ఇంటికి వచ్చి త‌లుపులు తీశారు. ఇత‌రుల స‌హాయంతో త‌లుపులు తెరిచారు. ఆయ‌న కూడా డాక్ట‌రే. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సౌంద‌ర్య‌కు తొమ్మిది నెల‌ల కుమార్తె ఉంది. 

ఆమె మృతికి పూర్తి కార‌ణాలు తెలియ‌లేదు. అయితే.. కొంతకాలంగా సౌంద‌ర్య డిప్రెష‌న్లో ఉన్న‌ట్లుగా ఆమె భ‌ర్త చెబుతున్నారు. దీంతో ఆమె మృతికి కార‌ణాలేంటి? ఆరోగ్య స‌మ‌స్య‌లా, కుటుంబ త‌గాదాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. కుటుంబ స‌భ్యులు అంద‌రూ షాక్ లో ఉన్నందున ప్ర‌స్తుతం పూర్తి స్థాయి వివ‌రాలు సేక‌రించ‌లేక‌పోతున్నామ‌ని, అంత్య‌క్రియ‌ల అనంత‌రం వివ‌రాలు సేక‌రిస్తామ‌ని పేర్కొంటున్నారు.

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis