వీడియో : చిరంజీవికి చిన్ని కృష్ణ క్షమాపణలు.. అప్పుడు తిట్టిన నోటితోనే..!

చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటి ఇంద్ర. ఈ మూవీలో సరికొత్త మెగాస్టార్ కనిపిస్తారు. ఇందులో వీణ స్టెప్ ఎవర్ గ్రీన్ హుక్ స్టెప్. ఈ మూవీకి కథ అందించాడు రచయిత చిన్ని కృష్ణ. అయితే గతంలో చిరంజీవిపై ఆరోపణలు చేశాడు చిన్ని కృష్ణ.. తాజాగా

చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటి ఇంద్ర. ఈ మూవీలో సరికొత్త మెగాస్టార్ కనిపిస్తారు. ఇందులో వీణ స్టెప్ ఎవర్ గ్రీన్ హుక్ స్టెప్. ఈ మూవీకి కథ అందించాడు రచయిత చిన్ని కృష్ణ. అయితే గతంలో చిరంజీవిపై ఆరోపణలు చేశాడు చిన్ని కృష్ణ.. తాజాగా

‘కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు’ ఈ సామెత టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవికి వర్తిస్తుందేమో బహుశా. ఎందుకంటే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయనపై  కొంత మంది పని గట్టుకుని  వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉంటారు. చిరు ఎలాంటి వారే, ఆయన వ్యక్తిత్వం ఏమిటో తెలిసిన వారు సైతం ఆరోపణలు గుప్పించారు. మొన్నటి మొన్న ఓ వివాదంలో ప్రముఖ నటి త్రిషకు అండగా నిలిచిన మెగాస్టార్ పై ఇష్టమొచ్చినట్లు నోరు జారాడు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. కానీ.. ఎన్ని అపవాదులు వచ్చినా.. స్పందిచని నైజం ఆ శిఖరానిది. గతంలో కూడా ప్రముఖ రచయిత ఒకరు అన్నయ్యపై ఆరోపణలు చేసి.. ఎట్టకేలకు తన తప్పును తెలుసుకున్నాడు.

చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన చిత్రం ఇంద్ర. మెగాస్టార్‌లోని మరో కోణం చూపించిన మూవీ. ఈ సినిమాకు కథ, మాటలు అందించారు రచయిత చిన్ని కృష్ణ. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవిపై చిన్ని కృష్ణ పలు విమర్శలు చేశారు. ఇంద్ర వంటి హిట్ చిత్రాన్ని అందిస్తే కనీసం తనను ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టలేదంటూ గతంలో ఆరోపణలు చేశారు. తాజాగా చిరంజీవికి దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ రావడంపై ఓ వీడియో ద్వారా స్పందించారు చిన్ని కృష్ణ. ఇందులో ఆయన్ను కలిసినట్లు.. అప్పట్లో చిరంజీవిపై విమర్శలు చేయడానికి గల కారణాలు వెల్లడించారు. ఇంతకు ఆ వీడియోలో ఏం చెప్పారంటే..

‘ చిరంజీవి అన్నయ్యకు పద్మ విభూషణ్ వచ్చిందని తెలిసి.. హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆయన్ను కలిశాను. ఈ భూమ్మీద పుట్టినటు వంటి కొంత మంది ఎప్పుడో కప్పుడు, ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు. తప్పుగా మాట్లాడతారనేది నగ్న సత్యం. 45 సంవత్సరాల వయస్సున్న నన్ను నమ్మి.. ఇంద్ర సినిమా అవకాశం ఇచ్చిన చిరంజీవి గారిని అనరాని మాటలు అన్నాను. బ్యాడ్ టైమ్ నడుస్తున్న సమయంలో నన్ను కొంత మంది ప్రభావితం చేశారు. వారి పేర్లు చెప్పను. అలా మాట్లాడటం వల్ల.. నా భార్యా బిడ్డలు, స్నేహితులు, చెల్లెలు, బావ, సమాజం నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుండి మీతో మాట్లాడే ఈ క్షణం వరకు నేను ఎంతో మదనపడ్డాడు. భగవంతుని ముందు క్షమాపణలు చెప్పాను. స్నేహితుల ముందు బాధను వెళ్లగక్కాను. నాలో నేను అంతర్మధనం చెందాను’ అని చెప్పారు చిన్ని కృష్ణ. ఇంకా ఏం అన్నారంటే..

‘పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవికి వచ్చిందని తెలిసి.. కలవడానికి వెళితే.. అన్నయ్య బాగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను పలకరించినటువంటి ఓ పద్దతి, నా కొడుకు, కూతురు గురించి, నా జీవితం గురించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి వ్యక్తినా నేను నా నోటితో తప్పుగా మాట్లాడాను అని భావించాను. వెంటనే నన్ను క్షమించమని అడిగాను. పెద్ద మనస్సుతో క్షమించడమే కాకుండా.. ఎంతో ఆప్యాయతగా మాట్లాడారు. కథలేమైనా రాస్తున్నావా చిన్ని అని దగ్గరకు తీసుకుని మాట్లాడారు. అన్నయ్య ఇంకెప్పుడు ఈ పెదాల నుండి ఎవర్నీ తప్పుగా మాట్లాడను. మనస్పూర్తిగా మరొక్క సారి క్షమించమని అడిగాను. కలిసి పనిచేద్దాం.. ఏదైనా కథలు ఉంటే చెప్పమన్నారు. ఈసారి మీతో చేయబోయేది, మీకు రాయబోయేది ఈ భారత దేశం గుర్తుపెట్టుకోవాలి, మీకింకా ఎన్నో అవార్డులు భారత ప్రభుత్వం నుండి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్యా. వచ్చే జన్మంటూ ఉంటే మీ తోబుట్టువుగా పుట్టాలని కోరుకుంటున్నా. ఐ సామ్ సారీ మై డియర్ బ్రదర్’ అంటూ ముగించారు చిన్ని కృష్ణ.

Show comments