iDreamPost
android-app
ios-app

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత.. స్పానిష్ ఫ్లూ నుంచి కరోనా దాకా!

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత..  స్పానిష్ ఫ్లూ  నుంచి కరోనా దాకా!

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన జపాన్‌కు చెందిన కెన్ తనకా కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆమె వయసు 119 సంవత్సరాలు. ఆమె ఏప్రిల్ 19 న మరణించినా ఆ విషయాన్ని సోమవారం నాడు ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఇక సమాచారం ఇచ్చింది. కెన్ తనకా మరణానంతరం, ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన లుసిల్లే రెండన్ (సిస్టర్ ఆండ్రే) ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె వయస్సు 118 సంవత్సరాల 73 రోజులు. కెన్ జనవరి 2, 1903న నైరుతి జపాన్‌లోని ఫుకుయోకా ప్రాంతంలో జన్మించారు. అదే సంవత్సరంలో, రైట్ సోదరులు వారి స్వంత విమానంలో మొదటిసారి ప్రయాణించారు. అలాగే మేరీ క్యూరీ నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి మహిళగా నిలిచారు. 2019 మార్చి నెలలో గిన్నిస్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా కానేను గుర్తించింది. గిన్నిస్‌ సంస్థ గుర్తించే నాటికి ఆమెకు 116 ఏళ్లు. అలాగే 2020 సెప్టెంబరులో అత్యంత ఎక్కువకాలం జీవించిన జపాన్‌ వ్యక్తిగా కానే రికార్డు సృష్టించారు. అప్పటికి ఆమె వయసు 117 సంవత్సరాల 261 రోజులు.

ప్రపంచంలోనే సుదీర్ఘకాలం బతికిన రెండో వ్యక్తిగా కూడా ఆమె రికార్డులకు ఎక్కారు. ఆమె మరణం గురించి ట్వీట్ చేస్తూ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ “జనవరి 2019 లో 116 సంవత్సరాల 28 రోజుల వయసులో ఆమె జీవించి ఉన్న అతి వృద్ద వ్యక్తిగా నిలిచింది” అని పేర్కొంది. ఇక తనకా కుటుంబం ఈ నెల ప్రారంభంలో ఒక ట్వీట్‌లో ఆమె ఇటీవల తరచుగా అనారోగ్యంతో బాధపడుతోందని, “ఆసుపత్రిలోనే ఉందని” పేర్కొంది.

1903లో జన్మించిన తనకా 19 సంవత్సరాల వయస్సులో ఒక బియ్యం దుకాణం యజమానిని వివాహం చేసుకుంది. ఆమె 103 సంవత్సరాల వయస్సు వరకు తమ కుటుంబానికి చెందిన దుకాణంలో పనిచేసింది. ఇక తనకా దంపతులకు నలుగురు సంతానం కాగా మరొకరిని దత్తత తీసుకున్నారు. 1937లో రెండో చైనా-జపాన్‌ యుద్ధంలో పాల్గొనేందుకు భర్త, పెద్ద కుమారుడు వెళ్లిన సమయంలో.. తనకా తమ సొంత దుకాణం నడిపారు. సోడా, చాక్లెట్‌ సహా రుచికరమైన ఆహారం తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే తన సుదీర్ఘ ఆయువుకు కారణమని తనకా చెప్పేవారు. తనకా రెండుసార్లు క్యాన్సర్ నుండి బయటపడింది. ఆమె జీవితంలో అనేక చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. రెండు ప్రపంచ యుద్ధాలు, 1918 స్పానిష్ ఫ్లూ — అలాగే కోవిడ్-19 మహమ్మారి నుంచి కూడా ఆమె బయటపడింది. తనకా ఫుకుయోకాలోని వృద్ధాశ్రమంలో నివసించేవారు. రోజూ ఉదయాన్నే ఆరు గంటలకు నిద్రలేచి, మధ్యాహ్నం గణితం, క్యాలిగ్రఫీ సాధన చేస్తూ గడిపేది. ఒథెల్లో అనే బోర్డ్​ గేమ్​ ఆడడంలో తనకా సిద్ధహస్తురాలు, ఆమె అందరినీ ఓడించేదట. 2021లో జరిగిన చైనా ఒలింపిక్స్​లో చక్రాల కుర్చీలో కూర్చుని టార్చ్ రిలేలో పాల్గొనాలని తనకా ఆశపడింది. అయితే కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. ఇక సోమవారం తనకా మరణాన్ని తన వెబ్‌సైట్‌లో ప్రకటిస్తూ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ “భూమిపై నివసిస్తున్న అత్యంత వృద్ధులు, జీవించి ఉన్న అతిపెద్ద వ్యక్తి (ఆడ) టైటిల్‌స్ కోసం ఇంకా ఎవరు అర్హులో ప్రస్తుతం పరిశోధిస్తున్నాము” తదుపరి వివరాలను తగిన సమయంలో ప్రకటిస్తామని పేర్కొంది.

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet