iDreamPost
android-app
ios-app

బిగ్ రిలీజెస్.. బజ్ ఉన్నా టాక్ చాలా ముఖ్యం బిగిలు!

  • Author ajaykrishna Updated - 08:40 AM, Thu - 28 September 23
  • Author ajaykrishna Updated - 08:40 AM, Thu - 28 September 23
బిగ్ రిలీజెస్.. బజ్ ఉన్నా టాక్ చాలా ముఖ్యం బిగిలు!

2023 సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ నుండి చెప్పుకోదగ్గ సినిమాలు పెద్దగా రాలేదని చెప్పాలి. సెప్టెంబర్ నెల.. విజయ్ దేవరకొండ ఖుషితో మొదలైనప్పటికీ.. ఆ తర్వాత వారం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మాత్రం ఊరికే వదిలేశారు. తమిళ డబ్బింగ్ సినిమా ‘మార్క్ ఆంటోనీ’ వచ్చి.. క్యాష్ చేసుకుంది. మొన్న నాలుగో వారం చిన్న సినిమాలకు తోడు బృందావన కాలనీ రీ రిలీజ్ అయ్యింది. ఇలా చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు తప్ప మూడు వారాలుగా స్ట్రెయిట్ తెలుగు బిగ్ మూవీస్ ఏవి రాలేదు. ఇప్పుడు ఫైనల్ వీక్.. సెప్టెంబర్ 28న రెండు తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.

ఉస్తాద్ రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద.. శుక్రవారం రిలీజ్ అవుతుంది. ఆ మరుసటి రోజే శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ పెదకాపు రిలీజ్ అవుతోంది. ఇవి స్ట్రెయిట్ తెలుగు ఫిలిమ్స్. కానీ.. వీటికి తోడు స్కందతో పాటు వాయిదా పడిన తమిళ డబ్బింగ్ మూవీ చంద్రముఖి 2 క్లాష్ కి రెడీ అయ్యింది. సూపర్ హిట్ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. అయితే.. ఈ మూడు సినిమాలకు ప్రస్తుతం బుకింగ్స్ పరంగా.. హైప్ పరంగా బజ్ అయితే క్రియేట్ అయ్యింది. కానీ.. దాన్ని నిలబెట్టు కోవాల్సిన బాధ్యత సినిమాలపైనే ఉంది.

ఎందుకంటే.. ఇప్పుడున్న ఇండస్ట్రీలోని పరిస్థితులలో ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా.. కంటెంట్ ముఖ్యం అంటున్నారు ఆడియన్స్. కంటెంట్ ఎంత కొత్తగా.. ఫ్రెష్ గా ఉంటే అంతగా అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. కేవలం హీరో హీరోయిన్స్ క్రేజ్ పై నడిచే రోజులు పోయాయి. అందుకే.. స్కంద, పెదకాపు, చంద్రముఖి 2.. బజ్ అయితే క్రియేట్ చేసుకున్నాయ్.. కానీ, టాక్ చాలా ముఖ్యం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజుల్లో థియేటర్స్ కి జనాలు రావాలంటే.. టాక్ ఇంపాక్ట్ చాలా ఉంటోంది. అందుకే.. ఎట్టి పరిస్థితిలో ఈ వారం సినిమాలకు మంచి టాక్ వస్తే.. కలెక్షన్స్ పరంగా అద్భుతాలు జరిగే అవకాశం లేకపోలేదు. సో.. ఏం జరుగుతుందో చూడాలి. మరి స్కంద, పెదకాపు, చంద్రముఖి 2 మూవీస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet