iDreamPost
android-app
ios-app

జుట్లు పట్టుకుని తన్నుకున్న BJP మహిళా కార్యకర్తలు

జుట్లు పట్టుకుని తన్నుకున్న BJP మహిళా కార్యకర్తలు

ఆడవాళ్ల మాటలకు అర్ధాలే కాదూ.. పెడర్థాలు ఉంటాయి. అవే గొడవలకు దారి తీస్తుంటాయి. ఇప్పుడైతే రోడ్లపై గొడవలకు దిగడం లేదు కానీ.. గతంలో కుళాయిల వద్ద, రేషన్ దుకాణాల వద్ద తన్నుకునే వారు. ఇప్పుడు అప్పుడప్పుడు బస్సుల్లో సీటు కోసం తన్నుకు చస్తున్న దృశ్యాలు, మాటలతో యుద్ధాలు కనిపిస్తుంటాయి. ఇరుగు, పొరుగు కూడా గొడవ పడుతున్న రోజులు పోయాయి. ఇప్పుడు అన్నీ సకాలంలో సమకూరుతుండటంతో ఆ కళ అంతరించిపోతుంది. అటువంటి కళను గుర్తు చేస్తుంటారు మెత్తని మనస్సు కలిగిన మహిళలు. చీరలు కోసం మొన్న మహిళలు పొట్టు పొట్టు తన్నుకున్న దృశ్యాలు కనువిందు చేశాయి. ముఖ్యంగా మగజాతికి. ఆడదానికి ఆడదే శత్రువు అని రుజువు చేసేందుకు కంకణం కట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు నారీ మణులు.

తాజాగా అటువంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి కొట్టుకుందీ మామూలు మహిళలు కాదూ బీజేపీ కార్యకర్తలు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నడి రోడ్డుపై జుట్లు జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. వీరిని విడిపించేందుకు మగవాళ్లు కూడా ప్రయత్నించారు. అయినప్పటికీ వీరి వీరంగం కొనసాగింది. యుపిలోని జలౌన్‍లోనారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించింది బీజేపీ. ఆ సమయంలో మహిళా కార్య కర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతే ఆ కార్యక్రమం రసాభాసగా మారింది. కొంత మంది మహిళలు జుట్టు పట్టుకొని, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. రోడ్డుపై పడి తన్నుకున్నారు. ఈ వీడియోను షేర్ చేయగా.. సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఈ ఘటనపై యుపి పోలీసులు దృష్టి సారిస్తున్నారు.