iDreamPost
iDreamPost
ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి అయితే అతివృష్టి లేదా అనావృష్టిలా ఉంది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడిపోయింది. రాధే శ్యామ్ రావడం మీద అనుమానాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చిన్న ప్లస్ మీడియం బడ్జెట్ సినిమాలు పోటీ పడి మరీ డేట్లను ప్రకటించడం డిస్ట్రిబ్యూటర్లను నివ్వెరపరుస్తోంది. వీళ్లకు కనీస సమాచారం లేకుండా కొన్ని అనౌన్స్ మెంట్లు ఉండటం గమనార్హం. ఎక్కడ తేదీలను మిస్ అయిపోతామనే ఆత్రమే ఇక్కడ ఎక్కువ కనిపిస్తోంది. రాధే శ్యామ్ వాయిదా పడినట్టు అధికారికంగా ప్రకటించకపోయినా సరే జనవరి 14న వచ్చేందుకు సిద్ధపడినవి ఉన్నాయి. నిజంగా ఇవన్నీ వస్తే చిన్న సెంటర్స్ లో థియేటర్లు చాలవు.
ముందుగా జనవరి 7 రానా ‘1945’, ఆది సాయికుమార్ ‘అతిధిదెవొభవ’ను రాబోతున్నాయి. ప్రమోషన్లకు కనీస టైం లేనప్పటికీ మంచి తరుణం మించిన దొరకదు టైపులో లాక్ చేసుకున్నాయి. ఇక నెలల తరబడి ల్యాబ్ లో ఉన్న మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ని 14కి ఫిక్స్ చేశారు. ఆల్రెడీ ఇదే నెల 26కి తన ‘కిన్నెరసాని’ని వదలబోతున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీగా సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ ఉంది. భీమ్లా నాయక్ బ్యానర్ కావడంతో థియేటర్లు గట్టిగా ఇస్తారు. దిల్ రాజు నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ కూడా 14 మీద మనసు ఉందట. ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఒకరోజు ముందు 13న అజిత్ ‘వలిమై'(బలం)ఉన్న సంగతి మర్చిపోకూడదు
గల్లా అశోక్ ని పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో రూపొందించిన ‘హీరో’కి 15 ముహూర్తంగా పెట్టుకున్నారు. మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయట. ఎంఎస్ రాజు నిర్మించి దర్శకత్వం వహించిన ‘7 డేస్ 6 నైట్స్’ సంక్రాంతికే వస్తుందని పోస్టర్ వదిలారు రాజశేఖర్ మలయాళం రీమేక్ ‘శేఖర్’ కూడా ఇప్పుడు పండగ డిస్కషన్స్ లో సీరియస్ గా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాగార్జున ‘బంగార్రాజు’ మరో ఎత్తు. ముందే వచ్చేద్దామా అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. దుల్కర్ సల్మాన్ ‘సెల్యూట్’ కూడా ముందు చెప్పిన 15 కాకుండా 7 రావోచ్చట. అయినా ఇన్నేసి సినిమాలు వస్తే ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయిపోయి బుర్ర బద్దలు కొట్టేసుకోడూ
Also Read : Acharya : మంచి మెగా ఛాన్స్ మిస్ అయిపోయింది