ప్రభాస్ కు అరుదైన గౌరవం – కానీ

సాహో, రాధే శ్యామ్ ఫలితాలు నిరాశపరిచినా క్రేజ్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. నిర్మాణంలో ఉన్న కొత్త సినిమాల మీద హైప్ మాములుగా లేదు.

సాహో, రాధే శ్యామ్ ఫలితాలు నిరాశపరిచినా క్రేజ్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. నిర్మాణంలో ఉన్న కొత్త సినిమాల మీద హైప్ మాములుగా లేదు.

బాహుబలితో వచ్చిన ప్యాన్ ఇండియా గుర్తింపు ప్రభాస్ స్టార్ డంని ఏ స్థాయిలో పెంచిందో చూస్తున్నాం. సాహో, రాధే శ్యామ్ ఫలితాలు నిరాశపరిచినా క్రేజ్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. నిర్మాణంలో ఉన్న కొత్త సినిమాల మీద హైప్ మాములుగా లేదు. సలార్ కు ఇంకా ఏడాది టైం ఉన్నప్పటికీ దాని గురించిన అంచనాలతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఇక ఆది పురుష్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ వచ్చే సంక్రాంతికి కన్ఫర్మ్ అనే నమ్మకం అభిమానుల్లో ఉంది. రెండు రోజుల క్రితం పెదనాన్న కృష్ణంరాజుని అనారోగ్యంతో హఠాత్తుగా పోగొట్టుకోవడం తనకే కాదు పరిశ్రమకు సైతం తీరని లోటు

ఇక విషయానికి వస్తే ప్రభాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి సంవత్సరం ఢిల్లీ రామ్ లీలా మైదానంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏడాదికో థీమ్ చొప్పున స్పెషల్ గా డెకరేషన్ చేస్తారు. అందులో భాగంగా ఈసారి అయోధ్య రామాలయం బ్యాక్ డ్రాప్ ని తీసుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున రావణ దహనం చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా నిర్వాహకులు ప్రభాస్ ని ఆహ్వానించారు. దానికి డార్లింగ్ అంగీకరించాడు కూడా. అయితే ఇదంతా కృష్ణంరాజుగారు స్వర్గస్తులు కాక ముందు జరిగింది. ఇప్పుడు తీవ్ర విషాదంలో ఉన్న ప్రభాస్ దీనికి వెళ్లడం అనుమానమే అంటున్నాయి సన్నిహిత వర్గాలు.

వచ్చే నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా వేడుకలంటూ ఉండటం సందేహమే. అప్పటికి నెల దాటేస్తుంది కానీ యంగ్ రెబెల్ స్టార్ పెదనాన్న జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటికి వస్తాడా అనేది చెప్పలేం. ఇప్పుడీ పరిణామాల వల్ల షూటింగులకు కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. విడుదల తేదీలు మారకపోవచ్చు కానీ షెడ్యూల్స్ కొంత లేట్ అవుతాయి. 100 అడుగుల దిష్టిబొమ్మలు దహనం కోసం సిద్ధం చేసిన రామ్ లీలా కమిటీ సభ్యులు ప్రస్తుతం ప్రభాస్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రాలేకపోతే మరో సెలబ్రిటీతో పూర్తి చేస్తారు. గత ఏడాది అజయ్ దేవగన్, జాన్ అబ్రహం తదితరులు హాజరయ్యారు

Show comments