iDreamPost
android-app
ios-app

నాని తేల్చేశారు.. మాజీ మంత్రి గంట సంగ‌తేంటి?

నాని తేల్చేశారు.. మాజీ మంత్రి గంట సంగ‌తేంటి?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని, రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా తాను మాత్రం ఎదురొడ్డి బెజవాడలో గెలిచిన నాని అనూహ్యంగా ఇటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం టీడీపీలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. నాని ప్ర‌క‌ట‌న‌తో పార్టీలో మ‌రొక‌రి ప‌రిస్థితి ఏంట‌నే దానిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అత‌డే విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.

రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయి.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ గంటా శ్రీ‌నివాసరావు పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆ త‌ర్వాత ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు నియ‌మితులైన త‌ర్వాత‌.. గంటా బీజేపీలో చేర‌తార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. పార్టీ మార్పుపై ఆయ‌న ఎటూ తేల్చ‌కుండా, టీడీపీలోనూ ఉండ‌కుండా స్టీల్ ప్లాంట్ కు మ‌ద్ద‌తు అంటూ ఎమ్మెల్యే ప‌ద‌వికే రాజీనామా చేసేశారు. ఇక అక్క‌డ నుంచి రాజ‌కీయంగా క‌నిపించ‌కుండా పోయారు. అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర‌లేద‌నో, ఉత్త‌రాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటుంద‌న్న అప‌వాదు మూట‌గ‌ట్టుకున్న‌ టీడీపీ ఎమ్మెల్యేగా జ‌నాల్లో తిర‌గ‌లేకో కానీ.. ఆయ‌న ఊసే లేకుండా పోయింది.

గత 2019 ఎన్నికల్లో.. టీడీపీ భారీ సంఖ్యలో సీట్లు కోల్పోయింది. గెలిచిన వారు చాలా స్వల్ప సంఖ్యలోనే ఉన్నారు. అయితే.. వీరిలోనూ కొందరు పార్టీని విడిచిపోయారు. వారితో పార్టీకి ఇబ్బందిలేదు. ఇక ఎటొచ్చీ.. పార్టీలోనే ఉన్నామని చెబుతూ.. పార్టీకి దూరంగా ఉంటూ.. పార్టీకి తెలియకుండా.. సొంత పనులు చక్క బెట్టుకుంటున్న వారివల్లే.. ఇప్పుడు టీడీపీకి నష్టమనే మాట జోరుగా వినిపిస్తోంది.

ఇలాంటివారిలో విజయవాడ ఎంపీ నాని, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఉన్నారు. వీరు గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక ఆతర్వాత.. వీరి వల్ల పార్టీకి పెద్ద‌గా ప్రయోజనం క‌లిగిన‌ట్లుగా లేదు. అంతేకాదు.. ఒకరు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారంటూ.. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మరొకరు అధికార పార్టీ నేతలతో లోపాయికారీ… ఒప్పందాలు చేసుకున్నారనే గుసగుస వినిపిస్తోంది. అయితే.. వీరిలో ఒకరు తాము టీడీపీలోనే ఉన్నామని.. ఉంటామని చెప్పుకొచ్చారు. కానీ మరొకరు మాత్రం ఖండించలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో.. వచ్చే ఎన్నిల్లో వీరిని ఏం చేస్తారు? చంద్రబాబు ఇప్పటికీ వీరిపట్ల సానుకూ లంగా ఉన్నారా, అనేది తేలాల్సి ఉంది. వీరిని విభేదిస్తున్న క్షేత్రస్థాయి నాయకులకు మాత్రం వారి నిర్ణ‌యాలు మింగుడు పడడం లేదు. వీరిని కాదనాలనేది క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చంద్రబాబుకు చేస్తున్న విజ్ఞప్తి. వేరేవారికి అవకాశం ఇవ్వాలని.. పార్టీ అంటే విధేయత లేదని.. అలాంటివారికి టికెట్లు ఇవ్వరాదని.. అంటున్నారు. తాజాగా జరిగిన అయ్యన్న పాత్రుడి ఘటనలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారని.. టీడీపీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా.. ఈ ఇద్దరు నాయకులు మాత్రం స్పందించలేదు. మ‌రి అలాంటి వారి ప‌ట్ల చంద్ర‌బాబు వైఖ‌రి ఏంట‌నేది, టీడీపీలో ఉండ‌డంపై గంటా ఉద్దేశం ఏంట‌నేది తేలాల్సి ఉంది.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetholiganbetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis