iDreamPost
android-app
ios-app

దోస్తీపై బాబు క‌ల నెర‌వేర‌నుందా?

దోస్తీపై బాబు క‌ల నెర‌వేర‌నుందా?

దూరంగా ఉంటున్న పార్టీల వైపు మోదీ దృష్టి సారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దోస్తీకి సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు కూడా ఆ అవ‌కాశం కోస‌మే ఎదురుచూస్తున్నారు.

ప్ర‌స్తుతం సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న జ‌గ‌న్ ను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా ఢీ కొట్టడం చంద్ర‌బాబు వ‌ల్ల కాని ప‌ని. బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు ఆ చాన్స్ అస‌లే లేదు. బాబుకు ఇప్పటికే వయసు మీద పడుతోంది. యువ నాయకుడి లోకేశ్ రాణించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఈ నేపథ్యంలో జ‌గ‌న్ ను ఢీ కొట్టాలంటే చంద్ర‌బాబుకు ఓ అండ కావాలి. అదే ఇప్పుడు బీజేపీ రూపంలో ఎదురువుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో అటు టీడీపీ.. ఇటు బీజేపీ రెండు లాభపడతాయని విశ్లేషకులు అంటున్నారు. ఊహాగానాలు నిజమైతే చంద్ర‌బాబు క‌ల నెర‌వేరిన‌ట్లే. బీజేపీ తిరిగి టీడీపీతో పొత్తు కుదుర్చుకంటే అది బాబుకూ మేలు చేసేదే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ, జ‌న‌సేన పొత్తు కొన‌సాగుతోంది. అదే 2014 ఎన్నికల్లో టీడీపీ కూడా ఆ జ‌ట్టులో ఉంది. అప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు.. అటు కేంద్రంలో మోడీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పుడంతా బాగానే సాగింది. కానీ ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతర అంశాలపై విభేధాలు రావడంతో బీజేపీతో జనసేన టీడీపీ బంధం తెంచుకున్నాయి. 2019 ఎన్నికల సమయంలో మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు చంద్రబాబు భారీ ఎత్తున్న ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆయన వ్యూహాలు ఫలించక పోగా.. ఇటు యువ నేత జగన్ ధాటికి ఆయన పత్తా లేకుండా పోయారు. ఉన్న అధికారాన్నీ పోగొట్టుకున్నారు. జనసేన కూడా వామపక్షాలతో కలిసి పోటీ చేసి చతికిలబడింది. దీంతో బాబు ఒంటరైపోయారు.

ఇక జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ తిరిగి మోడీతో చేతులు కలిపారు. కానీ టీడీపీ మాత్రం ఒంటరిగానే సాగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పుంజుకోవాలంటే జనసేనను మాత్రమే నమ్ముకుంటే ఫలితం లేదని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేనకు క్షేత్రస్థాయిలో బలం లేదు. క్రీయాశీలకమైన కార్యకర్తలు తక్కువే. అందుకే జనసేనను నమ్ముకోలేని పరిస్థతి ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీతో జట్టు కట్టి పోటీ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉందనీ రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అందుకే మళ్లీ బాబుపై ప్రేమ చూపిస్తారనే ప్రచారం సాగుతోంది.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom