iDreamPost
android-app
ios-app

మూడు రోజులుగా ఇంటి ముందు భార్య పడిగాపులు!

  • Published Sep 16, 2023 | 4:51 PM Updated Updated Sep 16, 2023 | 4:51 PM
  • Published Sep 16, 2023 | 4:51 PMUpdated Sep 16, 2023 | 4:51 PM
మూడు రోజులుగా ఇంటి ముందు భార్య పడిగాపులు!

ఆడ పిల్ల పుట్టిందని సంబరపడిపోయే లోపు.. ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తున్నారు. పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయిలు.. మెట్టినింట అగచాట్లు పడుతున్నారు. అత్త, మామ, భర్త, ఆడపడుచులను బాధ్యతగా చూడాలంటూ తట్టుకోలేని బంధాల భారాన్ని ఆమె నెత్తిన రుద్దుతున్నారు. అర్థం చేసుకోవాల్సిన భర్త కూడా ఆమెను హింసకు గురిచేస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అదనపు కట్నం తావాలంటూ ఇబ్బందికి గురి చేస్తుంటారు. తాను తీసుకురాలేను అని చెప్పిందా.. ఆమెకు ప్రత్యక్ష నరకం చూపిస్తుంటారు. ఈ బాధలను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. మరికొంత మంది మహిళలు విడాకులు ఆశ్రయిస్తుంటే.. ఇంకొంత మంది .. కిమ్మనకుండా కాపురం చేసుకుంటున్నారు. అయినప్పటికీ వీరి వేధింపులు ఆగవు. ఎప్పటికైనా మారతాడులే అని ఎదురు చూస్తున్న భార్యలు ఇంకా ఉన్నారు.

అదనపు వరకట్నం తీసుకురావాలంటూ భర్త వేధించడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైలు కెళ్లిన భర్త బెయిల్ పై బయటకు వచ్చాడు. భర్త మారి ఉంటాడని నమ్మి.. భార్య తిరిగి అతడితో కాపురం చేసేందుకు వెళ్లగా.. ఆమెను ఇంట్లోకి రానీవ్వకపోవడంతో రోడ్డుపైనే నిరీక్షిస్తూ ఉండిపోయింది. ఈ ఘటన జగిత్యాలలోని కృష్ణా నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాలకు చెందిన గంగాధర్‌కు వరంగల్ జిల్లాకు చెందిన లావణ్యతో 2017లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే వరకట్నం తీసుకురావాలంటూ వేధించడంతో అతడిపై భార్య ఫిర్యాదు చేసింది. బెయిల్‌పై బయటకు వచ్చాడు భర్త. భర్తలో మార్పు వచ్చిందని భావించిన లావణ్య.. తిరిగి అతడితో కాపురం చేసేందుకు అత్తింటికి వెళ్లగా.. ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మూడు రోజులుగా రోడ్డుపైనే పడిగాపులు పడుతోంది. ఇరుగింటి పొరుగింటి వారు ఆమెకు సాయం నిలుస్తున్నారు. తన భర్తతో జీవించాలనుకుంటున్నట్లు లావణ్య చెబుతుంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişantikbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom