iDreamPost
android-app
ios-app

న్యాయం కావాలన్న రెండో భార్య.. మూడో భార్యతో కలిసి భర్త దాడి!

  • Published Sep 11, 2023 | 4:12 PM Updated Updated Sep 11, 2023 | 4:12 PM
  • Published Sep 11, 2023 | 4:12 PMUpdated Sep 11, 2023 | 4:12 PM
న్యాయం కావాలన్న రెండో భార్య.. మూడో భార్యతో కలిసి భర్త దాడి!

మహిళలు నిత్యం ఏదోఓరకంగా వేధింపులకు గురవుతున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో మహిళల పట్ల మోసాలకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నార కొందరు మూర్ఖము వ్యక్తులు. ఇదిలా ఉంటే ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి అన్యోన్యంగా జీవించి ఆదర్శంగా నిలవాల్సిన వారు కూడా తమ మధ్య చోటుచేసుకునే చిన్న చిన్న కలహాలు, మనస్పర్థల కారణంగా విడిపోయి లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మూడు పెళ్లిల్లు చేసుకుని మూడో భార్యతో కలిసి రెండో భార్యపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. అసలు అతడు మూడు పెళ్లిల్లు ఎందుకు చేసుకున్నాడు? ఇప్పుడు రెండో భార్యను ఎందుకు వేదిస్తున్నాడు? ఆ వివరాలు మీ కోసం..

నా భర్త నాకు కావాలంటు న్యాయం కోసం పోరాడుతున్న రెండో భార్యపై దాడికి పాల్పడిన ఆమె భర్త ఆయన మూడో భార్య. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో చోటుచేసుకుంది. నా భర్త నాకు కావాలంటూ నిన్నటి నుంచి భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేస్తుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతసాగరం మండల కేంద్రంలో విద్యాశాఖ కార్యాలయంలో సి.ఆర్.పి గా విధులు నిర్వహిస్తున్నాడు పోలయ్య అనే వ్యక్తి. ఇతడికి గతంలో మొదటి వివాహం జరిగింది. అయితే కొంత కాలానికి వారిద్దరి మధ్య గొడవల కారణంగా పోలయ్య ఆమెను వదిలించుకున్నాడు. ఆ తర్వాత పోలయ్య మస్తాన్ బీ అనే మహిళతో పరిచయం ఏర్పర్చుకుని ఆమెతో దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాడు.

ఈ క్రమంలో పోలయ్య మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో రెండో భార్య మస్తాన్ బీని వదిలించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం తెలసుకున్న మస్తాన్ బీ గత రెండు నెలల నుంచి నా భర్త నాకు కావాలంటూ అధికారుల ముందు మొరపెట్టుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేం లేక భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకూర్చుంది. ఈ క్రమంలో నిరసన చేపడుతున్న మస్తాన్ బీ పై శనివారం రాత్రి భర్త పోలయ్య, ఆయన మూడో భార్య దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన ఆమె అక్కడే కూర్చుని దీక్ష కొనసాగిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom