iDreamPost
android-app
ios-app

Shivani Rajashekar: మిస్‌ ఇండియా నుంచి శివానీ ఎందుకు వైదొలిగారు?

  • Published Jun 30, 2022 | 4:53 PM Updated Updated Jun 30, 2022 | 4:53 PM
  • Published Jun 30, 2022 | 4:53 PMUpdated Jun 30, 2022 | 4:53 PM
Shivani Rajashekar: మిస్‌ ఇండియా నుంచి శివానీ ఎందుకు వైదొలిగారు?

ఫెమినా మిస్‌ ఇండియా 2022 అంటే, అటు గ్లామ‌ర్ ప‌రంగానేకాదు, కెరీర్ ప‌రంగానూ చాలా ఉన్న‌త కిరీటం. ఈ పోటీల కోసం ప్లాన్డ్ గా శివానీ రాజశేఖర్ సిద్ధ‌మైంది. లేటెస్ట్ గా మిస్‌ తమిళనాడుగానూ ఎంపికైంది. శివానీకి క‌చ్చితంగా మిస్ ఇండియా ఫైన‌ల్ లిస్ట్ గా అవ‌కాశాలున్నాయ‌ని అప్పుడే చాలా మంది అనుకున్నారు. సరిగ్గా, కొన్ని రోజుల్లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉన్న సమయంలో, పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.


ఎందుకు శివానీ మిస్ ఇండియా పోటీలు వ‌ద్ద‌నుకుంది? శివానీకి మలేరియా సోకింది. రెస్ట్ తీసుకోవాల్సి వ‌చ్చింది. దీనికితోడు అనారోగ్యంతో బాగా సన్నబడింది. ఆ దెబ్బ‌కు, మిస్‌ ఇండియా పోటీల ట్రైనింగ్‌, గ్రూమింగ్‌ సెషన్స్ కు అటెండ్ కాలేదు. అదేస‌మ‌యంలో, మెడికల్‌ థియరీ ఎగ్జామ్స్ కూడా మొదలయ్యాయి. మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫినాలే అంటే జూలై 3న, శివానీకి ఎగ్జామ్ కూడా ఉంది. ఇప్పుడు మిస్ ఇండియాకు అటెండ్ కావాలా? లేదంటే ఈ పరీక్ష కోసం రెడీ కావాలా? చివ‌ర‌కు గ్లామ‌ర్ కిరీటం క‌న్నా, చ‌దువుకే శివానీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే ఫెమినా మిస్‌ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నానని సోష‌ల్ మీడియా పోస్ట్ లో క్లారిటీ ఇచ్చింది.


చదువు కోసం గ్లామ‌ర్ కెరీర్ వ‌దులుకుంద‌ని శివానీని కొందరు అభినందిస్తుంటే, మంచి పోయింద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. శివానీ ఇంత‌కు ముందు అద్భుతం, శేఖర్‌ సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషించింది. ఇప్పుడు ఆమె దృష్టంతా ఎగ్జామ్స్ మీద‌నే. ఆ త‌ర్వాతే రాజ్‌ తరుణ్‌తో కలిసి వెబ్‌ సిరీస్‌లో నటించ‌డం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabet