iDreamPost
android-app
ios-app

ప్రభాస్ 25 ఎవరితో.. మొత్తం ముగ్గురు లైన్ లో?

ప్రభాస్ 25 ఎవరితో.. మొత్తం ముగ్గురు లైన్ లో?

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత సాహొ అనే సినిమా సుజిత్రెడ్డి డైరెక్షన్ లో చేశారు. ప్యాన్ ఇండియా లెవల్ లో రిలీజయిన ఈ సినిమా కలెక్షన్లు బాగానే రాబట్టింది కానీ హిట్ అనిపించుకొలేక పోయింది. ఆ సినిమా తరువాత రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధేశ్యాం సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ఎప్పుడో విడుడల కావాల్సి ఉన్నా కరోనా మహమ్మారి కారణంగా లేట్ అవుతోంది. ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్ ఇప్పటికే దాదాపుగా మూడు సినిమాలు ప్రకటించారు. అందులో ఓంరౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలు ఉన్నాయి.

అయితే ఆయన 25వ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా త్వరలో వెలువడనుందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్టోబర్ 7వ తేదీన ప్రభాస్ 25 సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడబోతోంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. అయితే దర్శకుడు ఎవరు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక్కడ ఏకంగా మూడు పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో 25వ సినిమా చేస్తున్నాడు అని ఒక ప్రచారం జరుగుతుండగా సందీప్ వంగా దర్శకత్వంలో 25వ సినిమా చేస్తున్నాడని మరో ప్రచారం జరుగుతోంది.

అయితే వీరిద్దరూ కాదని ఆయన బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆ సినిమా చేస్తున్నాడని మరో ప్రచారం జరుగుతోంది. అయితే టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ 25వ సినిమా రాజమౌళితోనే ఉండబోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ చేస్తున్న రాజమౌళి ఆ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబుతో 28వ సినిమా చేయబోతున్నారు. ఇక ఆ సినిమా పూర్తి అయ్యాక ఆయన ప్రభాస్ తో సినిమా మొదలు పెడతారు. ఇండియన్ సినీ హిస్టరీలో మునుపెన్నడూ లేని కథతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2024లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏ విషయం అనేది ఏడవ తేదీన తేలిపోతుంది.

Also Read : చైతన్య సమంతాలు ముందే జాగ్రత్త పడ్డారా

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom