పరీక్షా హాలులోకి వస్తుండగా గుండెపోటు.. 9వ తరగతి విద్యార్థిని మృతి

పరీక్షలు వస్తున్నాయంటే.. ఎవ్వరికైనా భయమే. ఎంత బాగా చదివినా ఏం ప్రశ్నలు వస్తాయో, బాగా రాస్తానో లేదో అని ఆందోళన చెందుతుంటారు విద్యార్థులు. ఇలా ఆందోళన చెందడం వల్ల మానసిక కుంగుబాటుకు లోనవుతుంటారు. తద్వారా..

పరీక్షలు వస్తున్నాయంటే.. ఎవ్వరికైనా భయమే. ఎంత బాగా చదివినా ఏం ప్రశ్నలు వస్తాయో, బాగా రాస్తానో లేదో అని ఆందోళన చెందుతుంటారు విద్యార్థులు. ఇలా ఆందోళన చెందడం వల్ల మానసిక కుంగుబాటుకు లోనవుతుంటారు. తద్వారా..

బిడ్డలే తల్లిదండ్రులకు పంచ ప్రాణాలు. కానీ వారే తమ కళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోతుంటే.. ఆ వేదన వర్ణనాతీతం. గుండెపోటుతో చిన్న వయస్సులో పిల్లలు చనిపోతుంటే.. తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన నెలకొంటుంది. ఎన్నో ఆశలతో, ఆశయాలతో బతుకుతూ.. సరిగ్గా జీవితాన్ని చూడని యువతీ, యువకులను పొట్టనబెట్టుకుంటుంది ఈ హార్ట్ స్ట్రోక్. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారిని సైతం బలి తీసుకుంటుంది. ఈ విషయం వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు.  నిండా 20 ఏళ్లు నిండని వాళ్లే కాదూ.. కళ్లు సరిగ్గా తెరవని పసిగొడ్డులు సైతం గుండె పోటు కారణంగా మృత్యువాత పడుతున్నారు.

తాజాగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండె పోటుతో మరణించింది. పరీక్ష రాసేందుకు హాలులోకి అడుగుపెడుతున్న సమయంలో విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో.. వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ బాలికది గుజరాత్‌లోని అమ్రేలి. వివరాల్లోకి వెళితే.. రాజ్ కోట్ జిల్లా జస్తాన్ తాలూకాకు చెందిన సాక్ష్ రాజోసర అనే 15 ఏళ్ల బాలిక..  9వ తరగతి చదువుతుంది. స్కూల్లో పరీక్షా హాలులోకి వెళుతుండగా.. స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే సరికే ఆమె ప్రాణాలతో లేదని తేల్చారు వైద్యులు.

బాలిక మరణానికి సడన్ స్ట్రోక్ కారణమని వైద్యులు భావిస్తున్నారు. ఈ పాపకు గుండె పోటు రావడమేంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు తమతో ఆడుతూ పాడుతూ కనిపించిన అమ్మాయి మరణించే సరికి.. స్నేహితులు, ఉపాధ్యాయలు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆమె మరణానికి కారణాలు తెలుసుకునేందుకు రాజోసర మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు పోలీసులు.

Show comments