Krishna Kowshik
అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమాం, శ్రీ భువనేశ్వరి, రాజ రాజేశ్వరి, ఆనంద రూపిణీ పాలయమాం అంటూ భక్తి శ్రద్ధలతో దుర్గామాతను కొలుచుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. అయితే ఎప్పడు దసరా చేసుకోవాలో అర్థం కాక, తలలు పట్టుకుంటున్నారు. ఇంతకు దసరా ఎప్పుడంటే.. పండితులు ఏమంటున్నారంటే..?
అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమాం, శ్రీ భువనేశ్వరి, రాజ రాజేశ్వరి, ఆనంద రూపిణీ పాలయమాం అంటూ భక్తి శ్రద్ధలతో దుర్గామాతను కొలుచుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. అయితే ఎప్పడు దసరా చేసుకోవాలో అర్థం కాక, తలలు పట్టుకుంటున్నారు. ఇంతకు దసరా ఎప్పుడంటే.. పండితులు ఏమంటున్నారంటే..?
Krishna Kowshik
విజయ దశమిని దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో దసరాను పెద్ద పండుగలా చేసుకుంటారు. ఈ నవరాత్రుల్లో తెలంగాణలో బతుకమ్మలు చేసి దుర్గాదేవిని కొలుస్తుంటారు. విజయదశమి రోజు రావణాసురిని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఏపీలో అమ్మవారి ఆలయాలను సందర్శించి, భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు భక్తులు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దుర్గామాత భక్తులకు దర్శనమిస్తోంది. విజయవాడలో కృష్ణానదిలో హంస వాహనంపై అమ్మవారిని ఊరేగిస్తారు. అమ్మను కనులారా తరించేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఇటీవల ప్రతి పండుగ తగులు మిగులు రావడంతో ఎప్పుడు జరుపుకోవాలన్న కన్ఫ్యూజన్ ప్రజల్లో నెలకొంది.
ఈ సారి దసరా కూడా అక్టోబర్ 23, 24 తేదీల్లో వచ్చింది. ఇక పండితులు కూడా ఒకరు ఈ రోజు చేసుకోవాలని, ఒకరు ఆ రోజు చేసుకోవాలని చెప్పడంతో మరింత గందరగోళానికి గురౌతున్నారు జనాలు. ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి నాడు విజయ దశమి జరుపుకుంటారు. విజయ దశమి చేసుకోవడానికి పురాణాల్లో రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి దుర్గామాత.. మషిషాసురుడని వధించింది ఓ కథ కాగా, రావణుడిని రాముడు చంపి సీతమ్మను రాక్షసుల చెర నుండి విడిపించి అయోధ్యకు తీసుకువచ్చిన రోజు కూడా ఇదే అని మరో కథ వినిపిస్తోంది. అందుకే ఉత్తరాదిన ఆ రోజు రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ ఏడాది కూడా దసరా పండుగ జరుపుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు భక్తులు. అయితే ఈ సారి దసరా కూడా రెండు రోజుల పాటు వచ్చింది.
దీంతో ఎప్పుడు పండుగ చేసుకోవాలన్న మీమాంసలో పడిపోయారు ప్రజలు. ఈ నెల 23న విజయ దశమి జరుపుకోవాలా లేక 24న పండుగ చేసుకోవాలా అనే అనే సందిగ్ధంలో పడిపోయారు. పంచాంగం ప్రకారం అక్టోబర్ 23న దసరా పండుగ మొదలు అవుతుంది. ఆ రోజు సాయంత్రం 5.44 గంటలకు ప్రారంభం అవుతుంది. మంగళవారం అనగా అక్టోబర్ 24 మధ్యాహ్నం 3.14 గంటలకు ముగుస్తుంది. రెండు రోజులు తిధి రావడంతో ఎప్పుడు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. పండితులపై ఆధారపడుతున్నారు. అయితే చాలా మంది పండితులు పండుగను ఈ నెల 23న జరుపుకోవాలని సూచిస్తున్నారు. శృంగేరి పీఠం కూడా ఆ రోజే దసరా అని చెబుతోంది. ఇక పోతే రెండు తెలుగు రాష్ట్రాలు సైతం 23నే పండుగ చేసుకోవాలని చెబుతూనే.. 24న కూడా సెలవులు ప్రకటించాయి.