అర్పిత ఇంట్లో దొరికిన డైరీలో ఏముంది?? – కుంభకోణంలో కొత్త కోణాలు

  • Updated - 11:36 PM, Wed - 27 July 22
అర్పిత ఇంట్లో దొరికిన డైరీలో ఏముంది?? – కుంభకోణంలో కొత్త కోణాలు

పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈడీ సోదాల్లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. టీచర్ల నియామకం పేరిట జరిగన కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ, సన్నిహితురాలు ఆర్పితను పోలీసుులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజా దర్యాప్తులో మరింత సమాచారం లభించినట్లు తెలుస్తోంది.

సోదాలు నిర్వహించే సమయంలో ఆర్పిత ఇంట్లో ఒక నలుపు రంగు డైరీని సేకరించారు. ఈ డైరీలోనే మొత్తం కుంభకోణానికి సంబంధించిన కీలక విషయాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 40 పేజీల్లో ఉన్న సమాచారంలో చాలా విషయాలు ఉన్నాయని తెలిపారు.

గతంలో.. అంటే 2014-21 కాలంలో పార్థా ఆ రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే జరిపిన నియామక ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు ఆ డైరీ అర్పిత ఇంట్లోనే ఎందుకు ఉంది? ఈ కుంభకోణానికి ఇతర వ్యక్తులకు సంబంధం ఏంటి? ఇతరత్రా అంశాలపై మరింతి లోతుగా సమాచారన్ని సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

తాజాగా తనకు ఆరోగ్యం బాగోలేదని పార్థా పేర్కొనడంతో భువనేశ్వర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరిలించారు అధికారులు. అయితే తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఏవీ లేవని తెలియడంతో ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపింది ఈడీ. వివరాలు పరిశీలించిన తరువాత మరో పది రోజల కస్టడీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం.

Show comments