iDreamPost
android-app
ios-app

సీపీఎం నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం.. ఏమి జరిగింది?

సీపీఎం నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం.. ఏమి జరిగింది?

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిజం) కేంద్ర క‌మిటీ స‌మావేశాలు హైద‌రాబాద్ లో నిర్వ‌హించింది. బీజేపీకి వ్య‌తిరేకంగా రాజ‌కీయంగా ఎదురుదాడి సిద్దాంతాన్ని ముందుకు తీసుకురావాల‌ని నిర్ణ‌యించింది. మ‌రోవైపు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడుతున్నాడు. ఈ క్ర‌మంలో హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీపీఎంకు చెందిన పినరయి విజయన్ వెంట ఇద్దరు మంత్రివర్గ సహచరులతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్‌ కూడా ఉన్నారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ జ‌రిగింది. ఇరు పార్టీల ల‌క్ష్యం ఒక‌టే కానున్న నేప‌థ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయడంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెసేతర సీఎంలను, పలు పార్టీల అధినేతలను కలుస్తూ దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెర తీస్తున్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలను ఇటీవల ఓ రేంజ్‌లో టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు కేంద్రం తీరును తప్పుపడుతూనే మరోవైపు బీజేపీ,కాంగ్రెసేతర సీఎంలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలవడం ఆసక్తిగా మారింది. ఇటీవల చెన్నై వెళ్లి మరీ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్‌ వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్‌ను లంచ్‌కు పిలిచి మరీ చర్చలు జరిపారు. బీజేపీ తీరుపై కేరళ సీఎంతోపాటు సీపీఎం ఢిల్లీ నేతలతోనూ చర్చించారు కేసీఆర్‌. కేంద్రం నిర్ణయాలు, రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇదే కాదు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్‌. ఇటీవలే ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ఆ సాయాన్ని అందించేందుకు ఇతర రాష్ట్రాలు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలతోపాటు దేశంలో కీలక సమస్యలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న అంశాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందన్నది సీఎం కేసీఆర్ వాదన. కేంద్రం తన బాధ్యతలను, చేయాల్సిన ఇతర పనులను కూడా సరిగ్గా చేయడం లేదని చాలాసార్లు ఆరోపించారు.

ఈ పరిస్థితుల్లో కేంద్రం తీరుకు నిరసనగా జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల సీఎంలతో భేటీ కావాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌యేతర పార్టీల అధినేతలతోనూ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో దీనిపై రియాక్ట్‌ అయ్యారు కేసీఆర్‌. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం ఇతర పార్టీలను కలుపుకుని వెళ్తామని ప్రకటించారు. ఈ నెలలోనే ఒకటి, రెండు రాష్ట్రాలకు, మార్చిలోపు 5 నుండి 8 రాష్ట్రాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంట్‌కు ఆలోచనలు చేస్తున్న క్రమంలో కేసీఆర్ పర్యటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించినప్పటికీ పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు. ఇప్పుడు కేసీఆర్ సరికొత్త వ్యూహాలకు బీజేపీపై వ‌స్తున్న వ్యతిరేకత కూడా తోడ‌వుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Jojobet Girişivermectin tabletMadridbet girişMadridbet girişMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinTophillbetJojobet GirişcasibomCasibom GirişHoliganbetgalabetHoliganbetMarsbahis GirişCasibomJojobetHoliganbetJojobet