వివేకా హత్య కేసులో టీడీపీ ఉలికిపాటు

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కేసును సిబిఐ కి అప్పగించాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరపడానికి ప్రభుత్వం సిట్ ను వేసింది. సిట్ బృందం ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం దిశగా మొన్న మాజీ మంత్రి ఆదినారాణరెడ్డిని విచారణ చేసింది. విచారణకు హాజరైన తర్వాత ఆయన ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశాడు.

ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచిస్తే జరిగిన ,జరుగుతున్న పరిణామాలు ఎలా ఒకదానికొకటి సంభంధాలు కలిగి వున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే టీడీపీ తొమ్మిది నెలల క్రితం సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని రూల్స్ పాస్ చేసింది. అంతకంటే ముందే వివేకా హత్య జరిగింది. మరి అప్పుడు వారికి సీబీఐ ఎంక్వైరీ చేయించాలని గుర్తుకు రాలేదు. అప్పుడు ఏ చోటా టీడీపీ నేత కూడా కోర్టుకు పోలేదు. వారు చేసిందల్లా జగనే తన చిన్నాన్నను హత్య చేయించాడు అనే దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి చేరే విధంగా ప్రవర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. సిట్ దర్యాప్తు జరుగుతోంది. మరి అప్పుడు అవసరం రాని సిబిఐ ఇప్పుడు ఏమి అవసరం వచ్చింది ?.

ఇవాళ బీజేపీ గూటికి చేరిన ఆదినారాణరెడ్డి కేంద్రం కనుసన్నల్లో నడిచే సీబీఐ చేత విచారణ కోరుకుంటున్నాడు. లోతుగా అధ్యయనం చేస్తే ఎక్కడో తేడా కొడుతోంది. ఇంతకీ సీబీఐని రాష్ట్రం నుంచి బహిశ్కరించిన టీడీపీ తన నిర్ణయం తప్పని ఒప్పుకుందా ? లేక మనమే వారికి ఇటువంటివి యూటర్న్ తీసుకోవడం వారికి అలవాటే కదా అనుకుందామా !

Show comments