iDreamPost
android-app
ios-app

విశ్వక్సేన్ వార్నింగ్.. ఆ పోస్టుల్ని వెంటనే డిలీట్ చేయండి..

  • Published May 09, 2022 | 6:10 PM Updated Updated May 09, 2022 | 6:10 PM
  • Published May 09, 2022 | 6:10 PMUpdated May 09, 2022 | 6:10 PM
విశ్వక్సేన్ వార్నింగ్.. ఆ పోస్టుల్ని వెంటనే డిలీట్ చేయండి..

యువ హీరో విష్వక్సేన్ మాస్ ఇమేజ్ నుంచి బయటకి వచ్చి క్లాస్ ఇమేజ్ కూడా సంపాదించడానికి అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా చేశాడు. రిలీజ్ కి ముందు ఈ సినిమా సృష్టించిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా కోసం చేసిన ప్రాంక్ వీడియో, ఒక ఛానల్ లో యాంకర్ తో గొడవ.. ఇవన్నీ కూడా సినిమాకి మరింత కలిసొచ్చాయి. ఇక సినిమా కూడా మంచి విజయం సాధించింది.

తాజాగా విష్వక్సేన్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం గురించి పోస్ట్ చేసిన కొన్ని పోస్టులని, వార్తలని డిలీట్ చేయాలని అన్నాడు. ఇటీవల ఒక సినిమా విడుదల అయితే ఆ సినిమా ఓటీ టీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ వార్తలు రాసేస్తున్నారు. దాంతో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూడొచ్చు అనుకోని థియేటర్ కి వచ్చే జనాలు తగ్గుతున్నారు. అలాగే విష్వక్సేన్ సినిమా కూడా ఫలానా రోజు ఓటీటీలో రాబోతుంది అని కొంతమంది వార్తలు రాయగా వాటిపై సీరియస్ అయ్యాడు విశ్వక్.

దీనిపై స్పందిస్తూ రిలీజ్ చేసిన వీడియోలో విష్వక్సేన్ మాట్లాడుతూ.. అందరికి చాలా చాలా థ్యాంక్స్. నా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. నేను ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి హోప్ ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్. అయితే ఇప్పుడు నేను ఒక విషయం గురించి చెప్పాలి. ఒక పక్క మా సినిమా థియేటర్లో నడుస్తుండగానే మా సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కొందరు రాస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. మా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మేమే అనౌన్స్ చేస్తాం. ఇలా మీ ఇష్టమొచ్చిన డేట్స్ వేసి సినిమా థియేటర్లకు వచ్చేవాళ్లను చెడగొట్టకండి. నిజంగా చెప్పాలంటే మా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో నాకే తెలియదు. కాబటికి మా సినిమా ఓటీటీ రిలీజ్ గురించి పెట్టిన పోస్టులన్నీ డిలీట్ చేయండి, థియేటర్ కి వచ్చి సినిమాని చూడనివ్వండి అంటూ ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş