iDreamPost
android-app
ios-app

ఫైనల్ గా విశ్వక్ సినిమాకు డేట్ దొరికేసింది! రిస్క్ తప్పినట్లేనా?

  • Author ajaykrishna Updated - 04:43 PM, Tue - 17 October 23
  • Author ajaykrishna Updated - 04:43 PM, Tue - 17 October 23
ఫైనల్ గా విశ్వక్ సినిమాకు డేట్ దొరికేసింది! రిస్క్ తప్పినట్లేనా?

ఇండస్ట్రీలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. ఈ ఏడాది థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ సంఖ్య పెరిగినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే.. ప్రతీ వారం చూస్తూనే ఉన్నాం. వస్తే ఒకేసారి పది సినిమాల వరకు వస్తున్నాయి. లేదా మినిమమ్ మూడు నాలుగు మీడియం, చిన్న సినిమాలు వస్తున్నాయి. కానీ.. ఒకేసారి చిన్న సినిమాలు.. మీడియం. సినిమాలు వస్తే ఓ రకంగా పర్వాలేదు. కానీ.. పాన్ ఇండియా మూవీస్, స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు.. వాటికి పోటీగా మీడియం, చిన్న సినిమాలు వస్తున్నాయంటే.. ఖచ్చితంగా రిస్క్ తో కూడుకున్న పనే.

నిన్నటిదాకా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా గురించి అలాంటి టాకే వినిపించింది. విశ్వక్ సేన్ హీరోగా ప్రస్తుతం రూరల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ తెరకెక్కుతోంది. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కృష్ణ చైతన్య రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. పైగా ఈ ఏడాది విశ్వక్.. దాస్ కా ధమ్కి, నేహా బెదురులంక సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. మరి వారిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు మినిమమ్ సెట్ అయిపోయాయి.

ఇక సినిమా రిలీజ్ విషయంలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. మొదట సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ అని పోస్టర్స్ బయటికి వచ్చాయి. దీంతో ఆడియన్స్ అందరు ఓకే అని అనుకున్నారు. కట్ చేస్తే.. మళ్ళీ సినిమా సలార్ రిలీజ్ తర్వాత రెండు రోజులకు అంటే.. డిసెంబర్ 24న రాబోతుందని మరో టాక్ బాగా వైరల్ అయింది. కానీ.. ఇప్పుడు తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కి డేట్ దొరికినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సలార్ విడుదలైన వారం తర్వాత డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని సమాచారం. ప్రస్తుతానికి అదే డేట్ ఫిక్స్ అయ్యిందని.. త్వరలో అనౌన్స్ చేస్తారని అంటున్నారు. మరి ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş