iDreamPost
android-app
ios-app

మాస్‌ లుక్‌లో అదరగొట్టిన విజయ్‌ దేవరకొండ..

మాస్‌ లుక్‌లో అదరగొట్టిన విజయ్‌ దేవరకొండ..

విజయ్‌ దేవరకొండ-మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ ఫ్యామిలీ స్టార్‌’. గీతా గోవిందం ఫేమ్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరావేగంగా జరుగుతోంది. ఇక, తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఫస్ట్‌ గింప్స్‌లో విజయ్‌ దేవరకొండ మాస్‌ లుక్‌లో అదరగొట్టారు. పరుశురామ్‌ మార్కు మాస్‌ ఎలివేషన్స్‌ గూస్‌బమ్స్‌ తెప్పిస్తున్నాయి.

‘‘ భలే మాట్లాడుతారన్న మీరందరూ.. ఉల్లిపాయలు కొంటే వాడు మనిషి కాదా?.. పిల్లల్ని రెడీ చేస్తే వాడు మగాడు కాదా?.. ఐరనే ఒంచాలా ఏంటి?’’ అన్న డైలాగ్‌.. ఆ సన్నివేశం సినిమాలో విజయ్‌ దేవరకొండ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోందో తెలిసిపోతోంది. ఫ్యామిలీ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌ చేయనుందని అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక, గింప్స్‌ క్లైమాక్స్‌లో మృణాల్‌ ఠాకూర్‌ ‘‘ ఏమండీ’’ అని విజయ్‌ని పిలవటం.. విజయ్‌ తన్మయంతో ఆగిపోవటం హైలెట్‌గా నిలిచాయి.

కాగా, విజయ్‌ దేవర కొండ తాజాగా ‘‘ ఖుషీ’’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో విజయ్‌ సరసన సమంత నటించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది. దీంతో విజయ్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఖుషీ కంటే ముందు వచ్చిన లైగర్‌ అట్టర్‌ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాతోనైనా ట్రాక్‌లో పడాలని విజయ్‌ దేవరకొండ భావిస్తున్నారు. మరి, ‘ఫ్యామిలీ స్టార్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet