iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌ డింపుల్‌ హయతి ఇంట వేణుస్వామి ప్రత్యేక పూజలు.. ఇక దశ తిరిగినట్టేనా?

  • Published Jun 26, 2023 | 1:26 PM Updated Updated Jun 26, 2023 | 1:26 PM
  • Published Jun 26, 2023 | 1:26 PMUpdated Jun 26, 2023 | 1:26 PM
హీరోయిన్‌ డింపుల్‌ హయతి ఇంట వేణుస్వామి ప్రత్యేక పూజలు.. ఇక దశ తిరిగినట్టేనా?

వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల భవిష్యత్తుకు సంబంధించి ఆసక్తికర, సంచలన విషయాలు చెబుతూ.. వార్తల్లో నిలుస్తుంటాడు. సమంత-నాగచైతన్య విడాకులకు సంబంధించి వేణు స్వామి చెప్పిన మాటలు నిజం కావడంతో.. ఈయన పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత నుంచి వేణు స్వామి సెలబ్రిటీల గురించి చెప్పే వ్యాఖ్యలపై జనాల్లో ఆసక్తిపెరిగింది. సెలబ్రిటీలకు సంబంధించి జ్యోతిష్యం చెప్పడం మాత్రమే కాక.. వారి కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తాడు. గతంలో రష్మిక మందన్నా కోసం ఇలానే ప్రత్యేక పూజలు చేశాడు వేణుస్వామి. ఆ తర్వాత ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌ కోసం వేణుస్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో..  మరో హీరోయిన్‌ డింపుల్‌ హయతి కూడా చేరింది.

కొన్ని రోజుల క్రితం డింపుల్‌ హయతి పేరు.. మీడియాలో మారుమోగింది. జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీస్‌ అధికారితో పార్కింగ్‌ విషయంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. డింపుల్‌ హయతి మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా వేణు స్వామి.. డింపుల్‌ హయతి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వేణు స్వామి.. హీరోయిన్‌ డింపుల్‌ హయతి కోసం ప్రత్యేకంగా పూజలు, యాగాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకోవడం వల్ల డింపుల్‌ హయతి ఇలా ప్రత్యేక పూజలు చేయించుకుని ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు.

డింపుల్‌ హయతి తొలిసారి.. గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత వరుస అవ‌కాశాల‌ను అందింపుచ్చుకుంది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఖిలాడి చిత్రంలో గ్లామ‌ర‌స్ పాత్ర‌లో మెప్పించింది. అలాగే రీసెంట్‌గా విడుద‌లైన గోపీచంద్ చిత్రం రామ‌బాణంలోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాక‌పోవ‌టం, పోలీస్‌ ఆఫీసర్‌తో గొడవ.. తదితర కారణాల వల్ల.. హయతి.. ఇలా పూజలు చేయించుకుందని భావిస్తున్నారు. త్వరలనే ఈమె ఇండియ‌న్ 2 సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి మ‌రి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom